Actress Sadha: తప్పు చేశా.. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే బాగుండేది

జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత.. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సదా.

Actress Sadha: తప్పు చేశా.. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే బాగుండేది

Sadha

Updated On : July 6, 2021 / 3:33 PM IST

Actress Sadha: జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత.. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సదా.. ప్రస్తుతం టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రత్యేకమైన విషయాలను పంచుకున్నారు సదా.

మహారాష్ట్రలో ముంబైకి, గోవాకు మధ్యలో రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సదాకు ముంబైలో చూసిన తేజ జయంలో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తర్వాత ఆమె అనేక తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

తన కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు క్రేజీ ప్రాజెక్టులను మిస్ అయ్యిందంట సదా. నాగ, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర ఇలా వరుసగా ఫ్లాపులు రాగా ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అయితే, తన కెరీర్‌లో రెండు సినిమాలు చెయ్యలేకపోయినందుకు బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది సదా.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. పీ వాసు డైరెక్షన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర చెయ్యమంటూ అవకాశం వచ్చిందని, అయితే డేట్స్ అడ్జస్ట్ కాక ఆ సినిమాను వదలుకున్నట్లు చెప్పారు. అలాగే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ పాత్రకు కూడా అవకాశం వచ్చిందని, ఆ సినిమాను కూడా చెయ్యలేకపోయినట్లు చెప్పారు. ఈ రెండు సినిమాలు చెయ్యకుండా తప్పుచేశానని అనిసిస్తూ ఉంటుందన్నారు సదా.