Ramya Krishna: సినిమా కాదు.. ఐటెం సాంగ్స్ చేయాలని ఉంది.. జగపతిబాబుకి షాకిచ్చిన రమ్యకృష్ణ

రమ్యకృష్ణ.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా(Ramya Krishna) పరిచయం అవసరంలేదు. 1984 ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత సీనియర్ హీరోల అందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Ramya Krishna: సినిమా కాదు.. ఐటెం సాంగ్స్ చేయాలని ఉంది.. జగపతిబాబుకి షాకిచ్చిన రమ్యకృష్ణ

I want to do item songs, not films: Ramya Krishna

Updated On : October 22, 2025 / 3:02 PM IST

Ramya Krishna: రమ్యకృష్ణ.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. 1984 ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత సీనియర్ హీరోల అందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో అలనాటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఎంతలా అంటే. కొన్ని పాత్రలు ఆమెతప్పా ఇంకేవరూ చేయలేరు అనేంతలా (Ramya Krishna)ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘నరసింహా’ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర ఆమె జీవితంలో మర్చిపోలేని పాత్రగా నిలిచిపోయింది. తనను కాదన్న హీరోపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురుచూసే పాత్రలో ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి.

K-Ramp: బ్లాక్ బస్టర్ ‘కె ర్యాంప్’.. మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఏంటన్నా ఇలా చేశావ్..

ఆ తరువాత కొంతకాలానికి దర్శకుడు కృష్ణవంశిని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించడం తగ్గించి.. ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యలో కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వాటికి కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇక రాజమౌలి దర్శకత్వంలో చేసిన బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సదేహం లేదు. “నామాటే శాసనం..” అంటూ ఆమె చూపించిన రాజసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న రమ్యకృష్ణ తాజాగా జబపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి గెస్ట్ గా వచ్చింది.

ఈ షోలో ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఆడియన్స్ తో పంచుకుంది. ఇక షోలో భాగంగా హోస్ట్ జగపతిబాబు.. “నువ్వు చేసిన సినిమాలలో ఏ సినిమాను మళ్ళీ చేయాలని ఉంది” అని అడిగాడు. దానికి సమాదానంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. “సినిమాలు కాదు కనీ నేను చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ మళ్ళీ చేయాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమాదానం విన్న హోస్ట్ జగపతిబాబు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి ఎపిసోడ్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. మరి ప్రోమోలోనే ఇంత అల్లరి చేసిన రమ్యకృష్ణ.. ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెంత అల్లరి చేసిందో చూడాలి.