IBomma Gives Huge Shock To Movie Lovers
IBomma Gives Huge Shock: సినిమాలను థియేటర్లలో చూడని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు హైక్వాలిటీ మూవీలు ఎక్కడ దొరుకుతాయా అంటూ గూగుల్ చేసి ఐబొమ్మ వెబ్‌సైట్ నుండి తమకు కావాల్సిన సినిమాను డౌన్‌లోడ్ చేసుకుని చూస్తుంటారు. తెలుగు సినిమాలను హెచ్‌డీ క్వాలిటీలో అందుబాటులో ఉంచే వెబ్‌సైట్‌గా ఐబొమ్మకు ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే.
BiggBoss 6 Geetu Royal: బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి మీకు తెలుసా..
ఓటీటీ కాలంలో నయా పైసా ఖర్చు లేకుండా సినిమాలను ఉచితంగా అందిస్తూ వస్తోన్న ఐబొమ్మ వెబ్‌సైట్ తాజాగా మూవీ లవర్స్‌కు ఓ భారీ షాకిచ్చింది. గతంలో ఈ వెబ్‌సైట్ తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి, యూజర్ల కోరిక మేరకు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఐబొమ్మ నిర్వాహకులు ప్రకటించారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తమ సర్వీసులను పొడగించేందుకు తాము మార్పులు చేస్తున్నట్లుగా ఐబొమ్మ తెలిపింది.
BiggBoss 6 : నేడే ఆట మొదలు.. ఈ సారి బిగ్‌బాస్ లో ఉండేది వీళ్లేనా..?
ఈ వార్తతో మూవీ లవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకాలం తమకు సినిమాలను ఉచితంగా అందించిన ఐబొమ్మ ఇకపై తమకు కనిపించకుండా పోతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి తమ సర్వీసులను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించిన ఐబొమ్మ, ఇప్పటికే డౌన్లోడ్ ఆప్షన్‌ను తీసేసిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే ఐబొమ్మ నిర్వాహకులు శాశ్వతంగా తమ సర్వీసులను నిలిపివేస్తారా, లేక మళ్లీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది చూడాలి.