Allu Arjun : బాల‌య్య‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శుభాకాంక్ష‌లు.. ‘నా హృద‌యం సంతోషంతో..’

పద్మభూషణ్‌కు ఎంపికైన సందర్భంగా బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Icon Star Allu Arjun congratulations to Padma Award honours

కేంద్ర ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. సినీ న‌టులు బాల‌కృష్ణ‌, అజిత్‌కుమార్‌, శోభ‌న, శేఖ‌ర్ క‌పూర్ త‌దిత‌రులను సినీ ప‌రిశ్ర‌మ‌కు అందించిన సేవ‌ల‌కు గాను ప‌ద్మ భూష‌ణ్ అవార్డుల‌కు ఎంపిక చేసింది. తాజాగా వీరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

‘ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినీ రంగానికి మీరు చేసిన సేవ‌ల‌కు గానూ ఈ పురస్కారాన్ని అందుకోవ‌డానికి మీరు పూర్తి అర్హులు. అలాగే.. అజిత్ కుమార్‌, మీ విజ‌యం కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయం.’ అని అల్లు అర్జున్ అన్నారు.

Kannappa : క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ లుక్ వ‌చ్చేది అప్పుడే.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌..

ఇక శోభ‌న్, శేఖ‌ర్ క‌పూర్‌, అనంత్ నాగ్‌ల‌కు ప‌ద్మ భూష‌ణ్ రావ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నారు అల్లు అర్జున్‌. క‌ళ‌ల విభాగంలో వీరింద‌రికి అవార్డు రావ‌డంతో త‌న హృద‌యం సంతోషంతో నిండిపోయింద‌న్నారు. అలాగే ప‌ద్మ అవార్డుల‌కు ఎంపిక అయిన వారంద‌రికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియజేశారు బ‌న్నీ.

Sankranthiki Vasthunam : ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన వెంకీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇది చూస్తే మైండ్ బ్లాంకే

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ భారీ విజ‌యాన్ని అందుకున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1800 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లను సాధించింది. అటు బాల‌కృష్ణ న‌టించిన మూవీ డాకు మ‌హారాజ్ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం బాల‌య్య అఖండ 2 మూవీలో న‌టిస్తున్నారు.