Allu Arjun Twitter: తగ్గేదేలే.. రజినీని మించిపోయిన బన్నీ!
నార్త్ టూ సౌత్ ఇప్పుడు అల్లు అర్జున్ హవా నడుస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

Allu Arjun Twitter (1)
Allu Arjun Twitter: నార్త్ టూ సౌత్ ఇప్పుడు అల్లు అర్జున్ హవా నడుస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. అంతకు ముందే స్టైలిష్ స్టార్ గా తెలుగుతో పాటు మలయాళంగా భారీ ఫాలోయింగ్ ఉన్న బన్నీకి పుష్పతో ఆల్ ఓవర్ ఇండియా భారీ క్రేజ్ సొంతమైంది. సహజంగానే తెలుగు స్టార్ హీరోలలో సోషల్ మీడియాలో ముందుటాడు అల్లు అర్జున్.
Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!
అలాంటిది ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత నేషనల్ లెవెల్ లో పేరు తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో దక్షిణాదిలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న స్టార్‌గా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీకి ట్విట్టర్‌లో ప్రస్తుతం 6.5 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ఫాలోవర్ల కంటే ఎక్కువ. రజనీకి ప్రస్తుతం 6.1 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు.

Allu Arjun Twitter
Unstoppable with NBK స్పెషల్ ప్రోమో.. ఇంత యంగ్ గా ఉన్నావేంటయ్యా బాబు!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రజనీ స్థాయి వేరు. సూపర్ స్టార్ గా ఆయన క్రేజ్ అందనిది. సోషల్ మీడియాలో కూడా సౌత్ స్టార్లలోనే రజనీకి భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటిది బనీన్ ఇప్పుడు రజనీని బీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప పార్ట్2 ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది పుష్ప టీమ్. తొలి పార్టుకే బన్నీ ఈ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంటే.. పుష్ప పార్ట్ 2 తర్వాత ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతుంది.