Pushpa 2 : 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్ర తిరగరాసిన ‘పుష్ప 2’..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప 2.

Icon Star Allu Arjun Pushpa 2 create history at hindi box office
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. రిలీజ్ తరువాత అంతకు మించి జోరును ప్రదర్శిస్తోంది. అన్ని ఏరియాల్లో ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో ‘పుష్ప-2’ మూవీ ఓ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా కలెక్ట్ చేయని విధంగా రూ.632.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు హాయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న’స్త్రీ2’ చిత్రం లైఫ్ టైమ్ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే అందుకోవడం విశేషం.
Soniya Akula : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ సోనియా.. కనిపించని పెద్దోడు, చిన్నోడు..!
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 14 రోజుల్లో రూ.1508 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వేగంగా దూసుకువెలుతోంది.
Pushpa 2 : ఓటీటీలోకి ‘పుష్ప 2’.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడో తెలుసా?
#Pushpa2TheRule is now NO.1 FILM AT THE HINDI BOX OFFICE🌋🌋
Hindi cinema Box Office is now Ruled by Pushpa 💥💥
Collects 632.50 CRORES NETT in Hindi – THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon… pic.twitter.com/hPsNUC41rC
— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024