Soniya Akula : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ సోనియా.. కనిపించని పెద్దోడు, చిన్నోడు..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఉన్నది నాలుగు వారాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల.

Bigg Boss 8 Telugu Fame Soniya Akula Wedding pics Goes Viral
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఉన్నది నాలుగు వారాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. తాజాగా అమ్మడు పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి ఏడడుగులు వేసింది. వీరి పెళ్లి శుక్రవారం అంగరంగవైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బిగ్‌బాస్ తాజా, మాజీ కంటెస్టెంట్స్ హాజరు అయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రామ్‌గోపాల్ వర్మ దర్వకత్వంలో రెండు చిత్రాల్లోనూ నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి అడుగుపెట్టింది. తన ఆట తీరు, ప్రశ్నించే తత్వంతో తొలి వారంలోనే సోనియా పేరు మారుమోగిపోయింది.
Daku Maharaaj : బాలకృష్ణను కలిసే బంపర్ ఆఫర్.. డిసెంబర్ 31లోగా ఈ ఒక్క పని చేస్తే చాలు..
టాప్-5లో ఆమె ఖచ్చితంగా ఉంటుందని చాలా మంది భావించారు. అయితే.. ఆ తరువాత పృథ్వీ, నిఖిల్‌తో స్నేహం ఆమెకు నెగిటివిటీని తెచ్చిపెట్టింది. దీంతో నాలుగో వారంలో ఎలిమినేట్ అయి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే తన లవ్ గురించి చెప్పేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకోగా, తాజాగా పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రోహిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో పెళ్లికి జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత తదితరులు కనిపించారు. ప్రేరణ సైతం వచ్చింది. అయితే.. హౌస్‌లో పెద్దోడు, చిన్నోడు అని పిలిచే నిఖిల్, పృథ్వీలు మాత్రం కనిపించలేదు. వీరిద్దరు ఎందుకు రాలేదు అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Pushpa 2 : ఓటీటీలోకి ‘పుష్ప 2’.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడో తెలుసా?
View this post on Instagram