Ilayaraja: చిన్నారికి ఇళయరాజా సంగీతం క్లాసులు..
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా నుంచి సంగీతం పాఠాలు నేర్చుకోవడం మామూలు విషయమా. అలాంటి అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది..

Ilayaraja
Ilayaraja: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా నుంచి సంగీతం పాఠాలు నేర్చుకోవడం మామూలు విషయమా. అలాంటి అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. అటువంటి అరుదైన ఛాన్స్ ఓ చిన్నారికి దక్కింది. ఆమై ఏదైనా కాంటెస్ట్ గెలిచి.. లేదా స్పెషల్ పని చేసో అలా చేయగలిగింది అనుకుంటున్నారా.. ఆ చిన్నారి ఇళయరాజా గారాల మనుమరాలు.
మనమరాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పియానోతో రాగాలు పలికించడం నేర్పిస్తున్నారు ఇళయరాజా. దానిని యువన్ శంకర్ రాజా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు సింగర్స్ నుంచి పలువురు ప్రముఖుల వరకూ చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
తన మనమరాలికి సంగీత పాఠాలు నేర్పుతున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న రంగమార్తాండ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.