ఇలియానా లేటెస్ట్ మూవీ ‘తేరా క్యా హోగా లవ్లీ’ ట్రైలర్ చూశారా..

గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ తన లేటెస్ట్ మూవీ ''తేరా క్యా హోగా లవ్లీ''లో డీగ్లామర్‌గా కనిపించి అభిమానులను థ్రిల్ చేసింది.

ఇలియానా లేటెస్ట్ మూవీ ‘తేరా క్యా హోగా లవ్లీ’ ట్రైలర్ చూశారా..

Ileana DCruz Stills from Tera Kya Hoga Lovely (courtesy: sonypicsfilmsin)

Ileana DCruz: హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ లేటెస్ట్ హిందీ మూవీ ”తేరా క్యా హోగా లవ్లీ” ట్రైలర్ విడుదలైంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఇలియానా ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రలో కనిపించి అభిమానులను థ్రిల్ చేసింది. అమ్మాయిల శరీర ఛాయ, వరకట్న సమస్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ లో తెలుస్తోంది. సీరియస్ ఇష్యూపై ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు బల్విందర్ సింగ్ జంజువా ఈ మూవీ తీసినట్టు కనబడుతోంది.

శరీర ఛాయ కారణంగా సమకాలీన సమాజంలో ఓ యువతి ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక సంఘర్షణను స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. అలాగే కూతురికి పెళ్లి చేయడంలో తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఇబ్బందులు, వరకట్న సమస్యను కూడా ఈ సినిమాలో చూపించారు. డీగ్లామర్ రోల్ లో ఇలియానా నటన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇలియానాకు జోడీగా రణదీప్ హుడా నటించాడు.

Also Read: గగన్‌యాన్ వ్యోమగామిని వివాహం చేసుకున్నాను.. మలయాళ నటి లీనా..

సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన తేరా క్యా హోగా లవ్లీ మూవీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ కుంద్రా, పవన్ మల్హోత్రా, గీతికా విద్య ఓహ్లియన్, రాజేంద్ర గుప్తా, అనిల్ రోధన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.