Ileana D’Cruz : ఇలియానా బేబీ బంప్ ఫొటోలు వైరల్.. మీరు చూశారా?
ఇటీవల కొన్ని రోజుల క్రితం తల్లిని కాబోతున్నాను, ప్రగ్నెంట్ అయ్యాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది ఇలియానా. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Ileana D'Cruz shares her baby bump photos in social media
Ileana Baby Bump : దేవదాసు(Devadasu) సినిమాతో తెలుగు(Telugu) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసి అనంతరం బాలీవుడ్(Bollywood) కి చెక్కేసింది. మొదట్లో బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చినా ఆ తర్వాత ఆఫర్స్ కష్టమైపోయాయి. ఇలియానా చివరిసారిగా 2021 లో ఓ బాలీవుడ్ సినిమాలో కనిపించింది. అప్పట్నుంచి ఇలియానా మళ్ళీ సినిమాలు చేయలేదు. ఇటీవలే ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది.
ఇటీవల కొన్ని రోజుల క్రితం తల్లిని కాబోతున్నాను, ప్రగ్నెంట్ అయ్యాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది ఇలియానా. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో నెటిజన్లు.. పెళ్లి చేసుకోకుండా తల్లి ఏంటి?, తండ్రి ఎవరు?.. అంటూ ఇలియానా పై ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది.
Samantha : ధోని నా ఫేవరేట్.. కానీ కోహ్లీ కోసం ఏడ్చాను.. IPLలో సమంత ఏ టీంకి సపోర్ట్ ఇస్తుందో తెలుసా?
తాజాగా ఇలియానా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తన ఇంట్లోనే డైనింగ్ టేబుల్ వద్ద బ్లాక్ డ్రెస్ లో నిల్చొని ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి బేబీ బంప్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఇలియానా బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు మళ్ళీ ఇలియానా ప్రగ్నెన్సీ గురించి కామెంట్స్ చేస్తున్నారు.