Most Popular Indian Stars : స‌మంత కంటే శోభితానే టాప్‌..

అత్యంత ప్ర‌జాదార‌ణ ఉన్న న‌టీన‌టుల జాబితాను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పోర్ట‌ల్ ఐఎండీబీ తాజాగా విడుద‌ల చేసింది.

IMDb Most Popular Indian Star Of 2024

అత్యంత ప్ర‌జాదార‌ణ ఉన్న న‌టీన‌టుల జాబితాను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పోర్ట‌ల్ ఐఎండీబీ తాజాగా విడుద‌ల చేసింది. 2024లో ఐఎండీబీలో అత్య‌ధికంగా వెతికిన న‌టీన‌టుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న 250 మిలియ‌న్ల‌కు పైగా సంద‌ర్శ‌కుల వాస్త‌వ పేజీ వీక్ష‌ణ‌ల ఆధారంగా చేసుక‌ని ఈ ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా సంస్థ తెలిపింది.

ఈ జాబితాలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డ్రిమీ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ సంవ‌త్స‌రంలో ఆమె న‌టించిన ‘బ్యాడ్‌ న్యూజ్‌’, ‘లైలా మజ్ను’ రీరిలీజ్‌తో పాటు ‘భూల్‌ భులయ్యా3’ చిత్రాలు విడుద‌ల అయ్యాయి. ఆ త‌రువాత రెండో స్థానంలో దీపికా ప‌దుకొణె ఉంది. మూడో స్థానంలో ఇషాన్ ఖ‌త్త‌ర్‌, నాలుగో స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉన్నారు.

Sivakarthikeyan : అక్క గురించి శివ కార్తికేయన్ ఎమోషనల్ పోస్ట్..

ఇక టాలీవుడ్ నుంచి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, స‌మంత‌, శోభిత దూళిపాళ్ల‌లు మాత్ర‌మే టాప్‌-10లో నిలిచారు. వీరిలో శోభిత 5వ స్థానంలో నిలిచింది. స‌మంత ఎనిమిదో స్థానంలో, ప్ర‌భాస్ ప‌దో స్థానంలో నిలిచారు.

ఇక ఐఎండీబీ జాబితాలో తొలి స్థానం ద‌క్క‌డంపై త్రిప్తి డిమ్రీ స్పందించింది. ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఇది త‌న‌కు ద‌క్కిన గౌర‌వం అని, అభిమానుల మ‌ద్దతు వలే ఇది సాధ్య‌మైన‌ట్లు చెప్పింది.

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీం.. కీలక ప్రకటన

మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్ స్టార్స్‌- ఐఎండీబీ 2024..
1. త్రిప్తి డిమ్రీ
2. దీపికా పదుకొణె
3. ఇషాన్ ఖట్టర్
4. షారుఖ్ ఖాన్
5. శోభితా ధూళిపాళ్ల
6. శార్వరి
7. ఐశ్వర్యరాయ్ బచ్చన్
8. సమంత
9. అలియా భట్
10. ప్రభాస్