Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీం.. కీలక ప్రకటన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2 ది రూల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది.

Allu Arjun
Pushpa 2 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2 ది రూల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి నుంచే పుష్ప-2 సందడి మొదలైంది. సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలను బుధవారం అర్థరాత్రి నుంచి పలు థియేటర్లలో ప్రదర్శించారు. అయితే, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద విషాధ ఘటన చోటు చేసుకుంది. పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి థియేటర్ వద్దకు చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ప్రయత్నించడంతో ఫ్యాన్స్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళ మృతిచెందగా.. తొమ్మిదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
Also Read: Ambati Rambabu: పుష్ప-2 సినిమాపై అంబటి రాంబాబు రివ్యూ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?
తొక్కిసలాటలో రేవంతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం తాజాగా స్పందించింది. ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ‘నిన్న రాత్రి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం’ అని అల్లు అర్జున్ టీం పేర్కొంది.
మరోవైపు తీవ్ర గాయాలపాలైన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, మరో 78 గంటలు అయితే గానీ పేషెంట్ కండిషన్ చెప్పలేమని వైద్యులు తెలిపారు.