Ambati Rambabu: పుష్ప-2 సినిమాపై అంబటి రాంబాబు రివ్యూ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?
పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావటంతోపాటు మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో సినిమాలో భాగస్వాములతోపాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ..

Ambati Rambabu
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2 ది రూల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి నుంచే పుష్ప-2 సందడి మొదలైంది. సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలను బుధవారం అర్థరాత్రి నుంచి పలు థియేటర్లలో ప్రదర్శించారు. భారీ సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు సినిమా థియేటర్ల వద్దకు చేరుకొని సందడి చేశారు. దీంతో థియేటర్ల వద్ద అల్లు అభిమానులతో కోలాహలం నెలకొంది. పలు థియేటర్ల వద్ద అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్ లో సినిమా చూశారు.
Also Read: Pushpa 2 : పుష్ప 2 చూస్తూ.. థియేటర్ లో ఎంజాయ్ చేసిన పుష్ప రాజ్, శ్రీవల్లి..
పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావటంతోపాటు మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో సినిమాలో భాగస్వాములతోపాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప-2 సినిమా గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రకారం..‘పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా.. కాదు వరల్డ్ ఫైర్’ అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 అద్భుత విజయాన్ని అందుకుందన్న అర్థం వచ్చేలా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పుష్ప -2 సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Pushpa అంటే
WildFire అనుకుంటివా
కాదు “World Fire”🔥— Ambati Rambabu (@AmbatiRambabu) December 5, 2024