Mohan Babu Family : పెదరాయుడి ఇంట కుస్తీ.. టీడీపీతో మంచు బ్రదర్స్ దోస్తీ!

నటుడు మోహన్‌బాబు ఇంట గొడవ కార్తీక దీపం సీరియల్‌లా డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది.

Mohan Babu Family : పెదరాయుడి ఇంట కుస్తీ.. టీడీపీతో మంచు బ్రదర్స్ దోస్తీ!

Updated On : January 17, 2025 / 12:30 PM IST

Gossip Garage : నటుడు మోహన్‌బాబు ఇంట గొడవ కార్తీక దీపం సీరియల్‌లా డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. హైదరాబాద్‌లో మొదలైన ఫ్యామిలీ వార్.. తిరుపతికి షిఫ్ట్ అయింది. హైదరాబాద్‌ జల్‌పల్లి ఫాంహౌస్‌ దగ్గర జరిగిన గొడవలో భౌతిక దాడుల నుంచి, కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. లేటెస్ట్‌గా మనోజ్‌ మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మంచు ఫ్యామిలీ పంచాయితీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచువారి ఇంటిలొల్లే ట్రెండింగ్‌ టాపిక్‌. అసలు అది అన్నదమ్ముల కొట్లాటా.? లేదా తండ్రి కొడుకుల గొడవా అనేది క్లారిటీ లేకపోవడంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఇదంతా ఫ్యామిలీ ఎపిసోడ్‌ అయితే..అటు మనోజ్..ఇటు మోహన్ బాబు పోట్లాడుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే మొన్నా మధ్య విష్ణు మంత్రి నారా లోకేశ్‌ను కలవడం.. నిన్నే మనోజ్‌ నారావారిపల్లెకు వెళ్ళి లోకేశ్‌తో భేటీ అవడం హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు అంటే మోహ‌న్‌బాబుకు గిట్టదు. అయినా రెండేళ్ల క్రితం చంద్రబాబుతో భేటీ అయ్యారు మోహన్‌బాబు. అప్పుడు ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ తెలుగు తమ్ముళ్లు ఒప్పుకోకపోవడంతో మోహన్‌బాబును పార్టీలో చేర్చుకోలేదన్న చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు మంచు ఇంట మంటలు పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మోహన్‌బాబు ఇప్పుడు వైసీపీకి, టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తనది బీజేపీ భావజాలంగా చెప్పుకొస్తున్నారు. ఆయన కొడుకులు మాత్రం మంత్రి లోకేశ్‌తో భేటీ అయి ఫ్యామిలీ ఇష్యూస్‌పై చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రికి టీడీపీ అన్నా..చంద్రబాబు అన్నా గిట్టదు. ఆయన తనయులు మాత్రం అధికారంలో సైకిల్‌ పార్టీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఫ్యామిలీ డిస్ప్యూట్‌ ఎటూ తేలకపోవడంతో పొలిటికల్ ఇన్వాల్‌మెంట్‌తో సాల్వ్‌ చేసుకోవాలని చూస్తున్నారట. అందులో భాగంగానే మొన్నామధ్య విష్ణు, ఇప్పుడు మనోజ్‌ లోకేశ్‌తో భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. ఎందుకు దాడి చేశాడంటే?

విష్ణు, మోహన్‌బాబు ఇద్దరు ఒకే మాట మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫ్యామిలీ పంచాయితీ విషయంలో తండ్రి వాయిస్‌నే వినిపిస్తున్నారు విష్ణు. అలా పెదరాయుడి డైరెక్షన్‌లోనే విష్ణు లోకేశ్‌ను కలిశారని.. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రశంసలతో ముంచెత్తారని అంటున్నారు. విష్ణు ద్వారా టీడీపీకి దగ్గరయ్యేందుకు మోహన్‌బాబు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు మనోజ్‌ కూడా లోకేశ్‌ను కలిశారు. తన భార్య మౌనికతో కలిసి లోకేశ్‌తో భేటీ అయిన మనోజ్‌.. ఫ్యామిలీ గొడవలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీకి రావద్దంటూ పోలీసులు అడ్డుకున్న తీరుపై మనోజ్‌ లోకేశ్‌కు వివరించినట్లు టాక్. తన సతీమణి మౌనిక సోదరి అఖిలప్రియ ద్వారా మనోజ్‌ కూడా టీడీపీతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఆ మధ్య మనోజ్‌ టీడీపీలో చేరబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

గత కొన్ని రోజుల నుంచి మంచు కుటుంబంలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారి తీశాయి. తిరుపతి దగ్గరున్న యూనివర్సిటీ విషయంలోనే గొడవలు జరుగుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని ఆ పంచాయితీని తెంపుకోవాలని చూస్తున్నారట. మంచు విష్ణు, మోహన్‌బాబు ఇద్దరు వైసీపీకి దగ్గరగా ఉన్నారని..మనోజ్‌కు టీడీపీ సహకరిస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఓవరాల్‌ ఎపిసోడ్‌లో ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయాన్ని పక్కనపెడితే..మంచు ఫ్యామిలీ రెండుగా చీలినట్లు అయితే కనిపిస్తోంది. విష్ణు, మోహన్‌బాబు ఒక స్టాండ్ మీదుంటే..మనోజ్‌ తన తండ్రి, సోదరుడితో విభేధిస్తున్నారట. దాంతో కుటుంబంలో గొడవలు ముదిరి పాకాన పడ్డాయని..అందుకే అధికార టీడీపీకి దగ్గరై..ఒకరి మీద మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారట మంచు బ్రదర్స్.

Sankranthiki Vasthunam collections : వంద కోట్ల క్ల‌బ్‌లో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’.. వెంకీమామ హ‌వా మామూలుగా లేదుగా..

ఎన్టీఆర్ హ‌యాంలో అన్నయ్యా అంటూ పెద్దాయనతో స‌న్నిహితంగా మెలిగిన మోహ‌న్ బాబు..ఆ తర్వాత 1995లో చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టినప్పడు ఆయ‌న‌తో క‌లిసి న‌డిచారు. రాజ్యస‌భ సభ్యుడయ్యారు. ఆ త‌ర్వాత హెరిటేజ్ వాటాల విష‌యంలో గొడ‌వ‌లు, ఇత‌ర కార‌ణాల‌తో చంద్రబాబుతో విబేధాలు వ‌చ్చాయ‌ని అంటుంటారు. ఇక 2019 ఎన్నిక‌లకు ముందు ఓపెన్‌గానే టీడీపీని చంద్రబాబును విమర్శించారు మోహన్‌బాబు. తిరుప‌తిలో ఉన్న త‌న కాలేజీకి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధులు ఇవ్వ లేద‌ని రోడ్డెక్కి నిర‌స‌న కూడా తెలిపారు. ఆ త‌ర్వాత కొడుకు విష్ణుతో క‌లిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా ఫ్యాన్‌ పార్టీ త‌ర‌ఫున ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రచారం కూడా చేశారు. వైసీపీ హయాంలో ఆయనకు రాజ్యస‌భ సీటు లేదా టీటీడీ ఛైర్మన్ ప‌ద‌వి ఇస్తార‌ని వార్తలు వ‌చ్చినా అదీ నిజం కాలేదు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్‌ తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు మోహన్‌బాబు. అలా ఇప్పుడు ఆయనకు అటు టీడీపీతో..ఇటు వైసీపీతో గ్యాప్‌ కంటిన్యూ అవుతోందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు ఇంట పంచాయితీ విషయంలో..టీడీపీ అధి నాయకత్వం ఎవరికి సపోర్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.