Indian Idol 13 Winner : ఇండియన్ ఐడల్ సీజన్ 13 విన్నర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఇండియన్ ఐడల్ 13వ సీజన్ ఫైనల్ కు నేహా కక్కర్, హిమేష్ రేష్మియా, విశాల్ దద్లానీ జడ్జీలుగా వ్యవహరించారు. ఫైనల్ కి ఆరుగురు కంటెస్టెంట్స్ రాగా ఈ ఆరుగురు ఫైనల్ ఎపిసోడ్ లో మెలోడీ, ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో అదరగొట్టేసారు.

Indian Idol 13 Winner Rishi Singh (Photo: Twitter)
Indian Idol 13 Winner : భారతదేశంలో టాప్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్(Indian Idol). ఎంతోమంది సింగర్స్ ఇందులో పాల్గొని కప్పు గెలవాలని ఆశిస్తుంటారు. అయితే ఈ ఇండియన్ ఐడల్ రియాల్టీ షో హిందీ(Hindi)లో ప్రసారం అవుతుంది. ఇటీవల ఇండియన్ ఐడల్ 13వ సీజన్ గ్రాండ్ గా జరగగా ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం (ఏప్రిల్ 2) ముంబై(Mumbai)లో ఘనంగా జరిగింది.
ఇండియన్ ఐడల్ 13వ సీజన్ ఫైనల్ కు నేహా కక్కర్, హిమేష్ రేష్మియా, విశాల్ దద్లానీ జడ్జీలుగా వ్యవహరించారు. ఫైనల్ కి ఆరుగురు కంటెస్టెంట్స్ రాగా ఈ ఆరుగురు ఫైనల్ ఎపిసోడ్ లో మెలోడీ, ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో అదరగొట్టేసారు. ఈసారి ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో అయోధ్యకు చెందిన రిషి సింగ్ విన్నర్ గా నిలిచాడు. రిషి సింగ్ ఈ షోలో గెలిచినందుకు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు 25 లక్షలు కూడా నగదు బహుమతిగా అందుకున్నాడు. దీంతో రిషి సింగ్ సంతోషం వ్యక్తం చేయగా మ్యూజిక్ అభిమానులు, నెటిజన్లు రిషికి అభినందనలు తెలుపుతున్నారు.
ఇక ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో కోల్‌కతాకు చెందిన దెబోస్మితా రాయ్ ఫస్ట్ రన్నర్‌గా నిలిచి అయిదు లక్షలు గెలుచుకుంది. రెండో రన్నర్ గా చిరాగ్ కొత్వాల్ నిలిచాడు.
Sab pe chalaake apna jaadu, Rocking Rishi ne jeeta sirf humaara dil hi nahi balki Indian Idol ki ye trophy bhi.
A well-deserved contestant of the Indian Idol Season 13.Congratulations, Rishi! ?✨#IndianIdol13 #IndianIdol #IndianIdolTheDreamFinale pic.twitter.com/M9sEU2Kzx9
— sonytv (@SonyTV) April 2, 2023