ప్రియుడు ఆత్మహత్య.. ఆసుపత్రిలో ఇండియన్ ఐడల్.. పరిస్థితి విషమం!

ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రి పాలయ్యారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. రేణు నగర్ సా రే గా మా పా 2012 మరియు ఇండియన్ ఐడల్ 2018 అనే రెండు పెద్ద రియాలిటీ షోలలో పాల్గొనడమే కాక, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
రేణు ప్రియుడు రవి నట్ విషపూరిత పదార్థాలు తీసుకొని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది రేణు నగర్ మీద తీవ్ర ప్రభావం చూపగా.. ఆమె మూర్ఛపోయింది. అనంతరం రేణును ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స చేస్తున్నారు.
ఆజ్ తక్ నివేదిక ప్రకారం, రవి నట్ విషం తీసుకొని ఆసుపత్రిలో చనిపోయాడు. అయితే, రవి నట్ ఎందుకు విషం తిన్నాడో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దీని గురించి సమాచారం లేదు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో, రేణు నగర్ పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంది. రవికి ఇంతక ముందు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు ఇంట్లో సంగీత విద్య నేర్చుకోవడానికి వచ్చి ఆమెతో ప్రేమలో పడ్డట్లు చెబుతారు.
https://10tv.in/bella-thorne-breaks-onlyfans-record-earning-over-1-million-in-first-24-hours/
అల్వార్ (రాజస్థాన్) లో నివసిస్తున్న రేణు నగర్ నిరంతరం స్టేజ్ షోలు చేస్తుంటారు. అదే సమయంలో, ఆమె గానం రాజస్థాన్‌లోనే కాదు, మొత్తం దేశంలో కూడా ప్రసిద్ది చెందింది. రేణు తన తండ్రి ప్రకాష్ నగర్ తో చాలా కాలం నుంచి కలిసి ఉంటున్నారు. అతని తండ్రి ప్రకాష్ కూడా సంగీత విద్వాంసుడు.