Asha Bhosle : ముగిసిన ఓ సంగీత శకం.. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత..
నేడు ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తల్లి మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు. (Asha Bhosle)
Asha Bhosle
Asha Bhosle : భారతదేశ దిగ్గజ గాయని, పద్మ విభూషణ్, లతా మంగేష్కర్ సోదరి ఆశా భోస్లే కన్నుమూశారు. దీంతో భారతదేశ సంగీత పరిశ్రమలో ఒక శకం ముగిసింది అంటూ అభిమానులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ఆశా భోస్లే 92 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో నిన్న రాత్రి ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్ లో చేర్చారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూనే నేడు ఏప్రిల్ 12న మధ్యాహ్నం మరణించారు. నిన్నటి నుంచి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వార్తలు రావడంతో ఆమె కోలుకోవాలని అంతా కోరుకున్నారు. నేడు ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తల్లి మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు.
Also Read : హీరోయిన్ పూర్ణ కూతురు బారసాల ఫంక్షన్ ఫొటోలు.. పేరు ఏం పెట్టారంటే..?
ఎనిమిది దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో కొన్ని వేల పాటలతో శ్రోతలను మెప్పించింది. ఆశా భోస్లే మరణంతో బాలీవుడ్ తో సహా అన్ని పరిశ్రమలలో విషాదం నెలకొంది. అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు, రాజకీయ, మిగతా రంగాల ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
ఆశా భోంస్లే అంతిమ సంస్కారాలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Also Read : వరుస హిట్స్.. కెరీర్ పీక్ స్టేజ్‌లో.. సొంతూరికి వెళ్లిపోదామనుకుంటున్న హీరో..
