Tollywood Hero : వరుస హిట్స్.. కెరీర్ పీక్ స్టేజ్లో.. సొంతూరికి వెళ్లిపోదామనుకుంటున్న హీరో..
ఈ టాలీవుడ్ హీరో సొంతూరికి వెళ్లిపోదామనుకుంటున్నాడట.(Tollywood Hero)
Tollywood Hero
Tollywood Hero : ఈ టాలీవుడ్ హీరో సొంతూరికి వెళ్లిపోదామనుకుంటున్నాడట. తాజాగా ఓ ఈవెంట్లో డైరెక్ట్ గానే ఈ మాటలు చెప్పాడు. గతంలో తన సొంతూళ్లో సొంత ఇల్లు ఉంటే అది అమ్మేసారట. ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు కొనాలని అనుకుంటున్నాడు ఈ హీరో.
ఆ యువ హీరో ఎవరో కాదు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్. ఇటీవలే డెకాయిట్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మరింత ప్రమోషన్స్ చేస్తూ అన్ని ఊర్లకు తిరుగుతుంది మూవీ టీమ్. ఈ క్రమంలో ఇటీవల వైజాగ్ కూడా వెళ్లారు. అడివి శేష్ పేరెంట్స్ సొంతూరు వైజాగ్. శేష్ మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయి. తాజాగా వైజాగ్ లో ఓ థియేటర్ విజిట్ కి వెళ్లిన అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : OG Prequel : పవన్ ఫ్యాన్స్ కి పండగే.. OG ప్రీక్వెల్ పనులు మొదలు.. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ నిర్మాణంలో..
అడివి శేష్ మాట్లాడుతూ.. నా స్వస్థలం విశాఖపట్నం వచ్చేయాలని ఉంది. వైజాగ్ వచ్చిన ప్రతిసారి నాకు మంచి ఫీలింగ్ వస్తుంది. వైజాగ్ లో మా పాత ఇల్లుని అమ్మేసాం. నేను అర్జెంట్ గా వైజాగ్ లోని నా పాత ఇల్లు కొనుక్కొని మళ్లీ ఇక్కడకు వచ్చేస్తా. వైజాగ్ వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్ నాకు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ లలో దొరకట్లేదు. వీలైతే వైజాగ్ వచ్చేస్తాను. హైదరాబాద్ లో ఉండి సినిమాలు తీసుకుంటూ, సినిమాలు లేనప్పుడల్లా వైజాగ్ లో ఉంటూ గడిపేయాలని ఉంది అని అన్నారు.
దీంతో త్వరలోనే అడివి శేష్ వైజాగ్ లో ఇల్లు కొనుక్కొని సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్ లో, లేనప్పుడు వైజాగ్ లో ఉంటారని తెలుస్తుంది.
Also Read : Harudu : ఒకప్పటి హీరో వెంకట్.. రీ ఎంట్రీ సినిమా ‘హరుడు’ ట్రైలర్ చూశారా..?
