OG Prequel : పవన్ ఫ్యాన్స్ కి పండగే.. OG ప్రీక్వెల్ పనులు మొదలు.. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ నిర్మాణంలో..
తాజాగా పవన్ కళ్యాణ్ OG ప్రీక్వెల్ పనులు మొదలయ్యాయని సమాచారం. (OG Prequel)
OG Prequel
OG Prequel : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో పంజా తర్వాత మోస్ట్ స్టైలిష్ సినిమాగా తెరకెక్కిన OG భారీ విజయం సాధించింది. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి గుడి కట్టేస్తాం అని అన్నారు. ఆ రేంజ్ లో OG సినిమా పవన్ ఫ్యాన్స్ ని మెప్పించింది. ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేని సినిమాని సుజీత్ ఇచ్చాడు.
అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉందని, అది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని దర్శకుడు స్వయంగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా OG ప్రీక్వెల్ చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం సుజీత్ నానితో బ్లడీ రోమియో సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. పవన్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక మళ్ళీ పవన్ – సుజీత్ కలవబోతున్నారు.
Also Read : Harudu : ఒకప్పటి హీరో వెంకట్.. రీ ఎంట్రీ సినిమా ‘హరుడు’ ట్రైలర్ చూశారా..?
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ OG ప్రీక్వెల్ పనులు మొదలయ్యాయని సమాచారం. OG సినిమాని DVV దానయ్య నిర్మించారు. ఇప్పుడు ప్రీక్వెల్ మాత్రం పవన్ కళ్యాణ్ మిత్రుడు, నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనుంది. అలాగే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది. దర్శకుడు సుజీత్ కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసి ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటాడని సమాచారం.
దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్, సుజీత్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే 2029 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ OG ప్రీక్వెల్ సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. OG ప్రీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జపాన్ లో ఏడేళ్లు గ్యాంగ్ స్టర్ గా ఏం చేసాడు అని చూపించబోతున్నట్టు సమాచారం.
Also See : Sravanthi Chokarapu : నలుపు చీరలో యాంకర్ స్రవంతి నగుమోము అందాలు.. ఫొటోలు..
