Indian Rich Actress : ఇండియాలో అత్యంత ధనిక నటి ఎవరో తెలుసా? పదేళ్లుగా ఒక్క హిట్ లేకపోయినా..
తాజాగా రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక నటి పేరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Indian Rich Actress Bollywood 90s Star Juhi Chawla her Net worth Details Here
Juhi Chawla : తాజాగా హురున్ రిచ్ లిస్ట్ సర్వే ప్రకారం మన దేశంలోని పలు విభాగాల్లో అత్యంత ధనికుల లిస్ట్ ని విడుదల చేసారు. ఇందులో సినిమాల్లో కూడా అత్యంత ధనిక నటీనటుల గురించి సపరేట్ లిస్ట్ విడుదల చేసారు. మన సెలబ్రిటీలు సినిమాలతోనే కాకకుండా బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి, యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తారు. తాజాగా రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక నటి పేరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇండియాలో అత్యంత ధనిక నటిగా జుహీ చావ్లా నిలిచింది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని, ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ని తలదన్ని జుహీ చావ్లా ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. జుహీ చావ్లా దగ్గర ఏకంగా 4600 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఈ లిస్ట్ లో ప్రకటించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐశ్వర్య రాయ్ 860 కోట్లతో, ప్రియాంక చోప్రా 650 కోట్లతో, అలియా భట్ 550 కోట్లతో, దీపికా పదుకోన్ 500 కోట్లతో నిలిచారు.
Also Read : Bigg Boss 8 : నాగ మణికంఠ ఎలిమినేట్..? ఆరోగ్య సమస్యలతో.. పంపించేయండి అంటూ ఏడుస్తూ..
90వ దశకంలో జుహీ చావ్లా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1984 మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది ఈ భామ. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ అయ్యాక గత పదేళ్లుగా అడపాదడపా సినిమాలు, గెస్ట్ రోల్స్ చేస్తూ వస్తుంది. అయితే జుహీ చావ్లాకు సినిమాలతో పాటు అనేక బిజినెస్ లు ఉన్నాయి. ఈమెకు షారుఖ్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లిన్ ఎంటెర్టైన్మెంట్స్ లో, కోల్ కత్తా నైట్ రైడర్స్ లో ఈమెకు భాగస్వామ్యం ఉంది. అలాగే ఈమె భర్త జై మెహతా పెద్ద వ్యాపారవేత్త. వారి కుటుంబ బిజినెస్ లలో కూడా ఈమెకు భాగస్వామ్యం ఉంది. అలా సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లలో కూడా కలిపి జుహీచావ్లా ఇండియాలోనే అత్యంత ధనిక నటిగా నిలిచింది.
ఇక ఇదే లిస్ట్ ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక నటుడిగా షారుఖ్ ఖాన్ 7300 కోట్లతో నిలిచాడు. షారుఖ్ – జుహీచావ్లాలకు పలు బిజినెస్ లలో భాగస్వామ్యం ఉండటం, వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడం గమనార్హం.