Pooja Hegde : పూజాహెగ్డేకి అసౌకర్యం.. అసభ్యంగా ప్రవర్తించిన విమాన సిబ్బంది..

పూజా హెగ్డే తన ట్విట్టర్ లో ఈ విషయంపై పోస్ట్ చేస్తూ.. ముంబై నుండి బయలుదేరిన విమానంలో విపుల్ నకాషే అనే పేరు గల సిబ్బంది మాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినందుకు...................

Pooja Hegde : పూజాహెగ్డేకి అసౌకర్యం.. అసభ్యంగా ప్రవర్తించిన విమాన సిబ్బంది..

Pooja Hegde

Updated On : June 9, 2022 / 5:02 PM IST

Pooja Hegde :  స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తను ఓ ఇండిగో విమానంలో ప్రయాణించగా అందులోని సిబ్బంది పూజాతో అసభ్యంగా ప్రవర్తించి అసౌకర్యానికి గురిచేశారట. దీనికి సంబంధించి పూజా హెగ్డే తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

పూజా హెగ్డే తన ట్విట్టర్ లో ఈ విషయంపై పోస్ట్ చేస్తూ.. ముంబై నుండి బయలుదేరిన విమానంలో విపుల్ నకాషే అనే పేరు గల సిబ్బంది మాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినందుకు చాలా విచారంగా ఉంది. ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు టోన్ తో మాతో ప్రవర్తించాడు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను. కానీ ఇది నిజంగా చాలా భయంకరంగా ఉంది అని తెలిపింది.

Mahima Chaudary : క్యాన్సర్ బారిన హీరోయిన్.. కన్నీళ్లు పెడుతూ వీడియో..

అయితే దీనికి ఇండిగో సంస్థ స్పందిస్తూ.. పూజా హెగ్డేకి క్షమాపణలు చెప్తూ మీ ప్రాబ్లమ్ ని, మీరు ప్రయాణించిన టికెట్ PNR నంబర్ ని మాకు మెసేజ్ చేయండి. మేము త్వరగా మీ సమస్యని పరిష్కరిస్తాము అని పోస్ట్ చేశారు. పూజా హెగ్డేతో అసభ్యంగా ప్రవర్తించారని ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ కాగా పలువురు నెటిజన్లు ఇండిగో సంస్థ, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.