Bheemla Nayak: రానా కోసం పవన్ కళ్యాణ్‌ని వాడుకున్నారు.. భీమ్లా నాయక్‌పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!
అలా ట్రైలర్ వచ్చిందో లేదో రికార్డులు తిరగ రాసేస్తుంది భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'.

Rgv And Varma
Bheemla Nayak: అలా ట్రైలర్ వచ్చిందో లేదో రికార్డులు తిరగ రాసేస్తుంది భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న భీమ్లా నాయక్ ట్రైలర్‌పై అభిమానుల నుంచే విభిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి.
ట్రైలర్ కట్ బాగోలేదని, దీనికన్నా ఫ్యాన్స్ ఎడిటింగ్ బాగుటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయగా.. ట్రైలర్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ట్రైలర్ చూశాక భీమ్లా నాయక్ టైటిల్ కంటే డానియెల్ శేఖర్ అనే టైటిల్ పెట్టి ఉండాల్సింది అంటూ కామెంట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.. ట్విట్టర్‌లో ఆర్జీవీ ట్వీట్‌లపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“బాహుబలి కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రానా దగ్గుబాటికే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది. అతన్ని సినిమాలో విలన్‌గా పెట్టుకున్నారు. అయితే, అక్కడ రానా దగ్గుబాటినే హీరో అనుకునే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితులు అయిన సినిమా మేకర్స్ దీనికి ఎందుకు అనుమతించారు” అని ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ.
నాకు తెలిసిన జ్ఞాన, శాస్త్ర దృక్కోణాల నుంచి భీమ్లా నాయక్ ట్రైలర్‌ని చూసి నిజాయితీగా చెబుతున్నా నా అభిప్రాయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ట్రైలర్ అయితే, రానా దగ్గుబాటి సినిమా అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. “#BheemlaNayakTrailerని చూస్తే, మేకర్స్ రానా దగ్గుబాటిని ప్రమోట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్‌ని తప్పుగా ఉపయోగించుకున్నట్లు అర్థం అవుతోంది. ఒక PK అభిమానిగా ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను” అంటూ మరో ట్వీట్ చేశారు.