Ira’s Diwali Celebrations: ప్రియుడి ఇంట్లో దీపావళి వేడుకల్లో స్టార్ హీరో కూతురు

అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ దీపావళి పండుగను ప్రియుడు నూపుర్ శిఖరే కుటుంబంతో కలిసి జరుపుకుంది.

Ira’s Diwali Celebrations: ప్రియుడి ఇంట్లో దీపావళి వేడుకల్లో స్టార్ హీరో కూతురు

Ira

Updated On : November 6, 2021 / 4:04 PM IST

Ira’s Diwali Celebrations: అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ దీపావళి పండుగను ప్రియుడు నూపుర్ శిఖరే కుటుంబంతో కలిసి జరుపుకుంది. ఆ చిత్రాలలో కొన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఐరా ఖాన్ అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నూపుర్ సాంప్రదాయ దుస్తుల్లో ఉండగా.. ఐరా ఖాన్ చీర కట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల్లో కనిపించింది. నూపుర్ శిఖరే పసుపు రంగు కుర్తా ధరించి ఉండగా.., ఐరా కుంకుమ రండు దుస్తులు వేసుకుంది.

గతేడాది ఫస్ట్ టైమ్ తన ప్రియుడిని పరిచయం చేసింది ఐరా. అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్‌ వ్యవహారం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా ఉంది. ఇప్పుడు దీపావళి పండుగను సైతం ప్రియుడు నుపూర్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది ఐరా.

నుపూర్ త‌ల్లి ప్రీత‌మ్ శిఖ‌రే కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొంది. నుపూర్ బాలీవుడ్‌లో పలువురు స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. అమీర్ ఖాన్‌కు కూడా నుపూర్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నాడు. ఐరాకు కూడా అతనే కోచ్‌గా ఉండగా.. ఆ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు.

ఐరా ఖాన్ ఎప్పుడూ కూడా తన పర్సనల్ విషయాలు సైతం మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. గతంలో ఐరా ఖాన్ తన తల్లి రీనా దత్తా ఇచ్చిన సెక్స్ ఎడ్యూకేషన్ బుక్ గురించి కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.

రీనా దత్తా తనకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన బుక్ ఇచ్చి చదవమని చెప్పిందని, తల్లి రీనా ఇచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ బుక్, వయసు పెరుగుతోన్న క్రమంలో, ఎంతో ఉపయోగపడిందని ఐరా చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)