Irumudi Collections: 200 కోట్ల ఇరుముడి.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ప్రాఫిట్స్ ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
Irumudi Collections: ఇటీవల కాలంలో భారీగా హిట్ అయిన సినిమాల్లో ఇదొకటి.
Irumudi Movie Collects 200 Crores Gross
Irumudi Collections: మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఇటీవల ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది. అయ్యప్ప స్వామి మాల బ్యాక్ డ్రాప్ తో, తండ్రి కూతుళ్ళ అనుబంధంతో, అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి అనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఇరుముడి సినిమా చూసి అయ్యప్ప స్వామి పాటలకు వైబ్ అవ్వడమే కాక క్లైమాక్స్ ఎమోషన్ కి ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తున్నారు.
ఇటీవల కాలంలో భారీగా హిట్ అయిన సినిమాల్లో ఇదొకటి. మొదటి వారం అయితే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి ఈ సినిమాకు. ఇరుముడి సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లోకి వచ్చింది. తాజాగా మూవీ యూనిట్ ఇరుముడి సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.
Also See : Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్..
ఇరుముడి సినిమాకు సినిమాకు 25 కోట్లకు పైగా థియేటరికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే కనీసం 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్ అయినట్టే. ఇప్పటికే 200 కోట్లు గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ విజయంపై నిర్మాతలతో పాటు టాలీవుడ్, రవన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

