Anushka Shetty: వ్యాపారవేత్తతో హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి?

తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన జేజమ్మ... ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతోందంటూ..

Anushka Shetty: వ్యాపారవేత్తతో హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి?

Anushka

Updated On : September 28, 2024 / 9:35 PM IST

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కకు పెళ్లి కాబోతోందట… టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన భాగమతి పెళ్లిపై ఎన్నో ప్రచారాలు… మరెన్నో వదంతులు.. ఐతే ఈ సారి ఈ హాట్‌ బ్యూటీకి మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. మరి ఈసారైనా అనుష్క పెళ్లి గాసిప్స్‌ నిజమవుతాయా? ఇంతకీ ఈ సారి తెరపైకి వచ్చిన వరుడు ఎవరు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లిపై మరోమారు గాసిప్స్‌ ప్రచారంలోకి వచ్చాయి. తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన జేజమ్మ… ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతోందంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళీ, హిందీ చిత్రాల్లో నటించారు. బాహుబలితో పాన్‌ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయింది.

నిశ్శబ్దం, భాగమతి, సైజ్ జీరో లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ క్వీన్‌.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని చేసింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ కాకపోవడంతో ప్రస్తుతం సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటోంది. ఇక ప్రస్తుతం సినిమాలను తగ్గించడంతో ఇంట్లో వాళ్లు అనుష్కకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోమని కుటుంబ సభ్యులు అనుష్కపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సంబంధంపై ఇరు కుటుంబ సభ్యులు ఓకే చేసినా.. ఇంకా అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ఒకవేళ అనుష్క పెళ్లికి ఒప్పుకుంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు వేయబోతోందని చెప్పవచ్చు. ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Game Changer : గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో చూశారా..? ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?