Simbu : హీరో శింబు తన అభిమానిని పెళ్లి చేసుకోబోతున్నాడా?
తమిళ ఇండస్ట్రీలో హీరో శింబు ప్రేమ, పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా శింబు ప్రేమ గురించి తమిళ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. శింబు తన వీరాభిమానిని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అభిమాని శ్రీలంకకు చెందిన అమ్మాయి అని...

is tamil hero Simbu marrying srilankan fangirl
Simbu : తమిళ ఇండస్ట్రీలో హీరో శింబు ప్రేమ, పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా శింబు ప్రేమ గురించి తమిళ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. శింబు తన వీరాభిమానిని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అభిమాని శ్రీలంకకు చెందిన అమ్మాయి అని, ఆమె తండ్రి బడా వ్యాపార వేత్త అని కూడా వార్తలు రాసుకొస్తున్నారు పలు వెబ్ సైట్స్ అండ్ మీడియా ఛానల్స్. కాగా ఈ విషయం పై శింబు టీం స్పందించింది. పెళ్లి వార్తలో ఎటువంటి నిజం లేదంటూ కొట్టిపడేశారు.
Hansika : హీరో శింబుతో బ్రేకప్ గురించి మాట్లాడిన హన్సిక..
శింబు మేనేజర్ ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పెళ్లి వంటి వార్తలు రాసే ముందు ఆ పర్సన్స్ కి సంబంధించిన వ్యక్తులను సంప్రదించండి. నిజం తెలుసుకొని ఆ తరువాత రాయండి. అంతేగాని ఏది పడితే అది రాయకండి. శింబు తన అభిమానితో ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ రాసిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తెలియజేశాడు. దీంతో శింబు పెళ్లి వార్తలకు చెక్ పడింది. కాగా శింబు గతంలో నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపాడు.
ఈ ఇద్దరి హీరోయిన్ లకు ఇటీవలే పెళ్లి అయ్యింది. దీంతో వాళ్ళిద్దరి మాజీ లవర్ అయిన శింబు పెళ్లి ఎప్పుడు అంటూ వార్తలు రాసుకొస్తున్నారు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హన్సిక, శింబుతో బ్రేకప్ గురించి మాట్లాడింది. ‘నా గత రేలషన్ షిప్ విచిత్రంగా ముగిసింది. ఆ బ్రేకప్ తరువాత మరో వ్యక్తికి ఓకే చెప్పడానికి నాకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది. అయినా అది ముగిసిన కథ’ అంటూ చెప్పుకొచ్చింది.