Is the story of 'Balagam' written by Jathi Ratnalu director Anudeep?
Balagam : జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ మూవీ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెరకెక్కించారు. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. చిన్న సినిమాగా వచ్చినా, ప్రమోషన్స్ మాత్రం పెద్ద సినిమా రేంజ్ లోనే చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటిఆర్ ని గెస్ట్ గా ఆహ్వానించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
కాగా ఈ సినిమా పై ఇటీవల ఒక వివాదం రాచుకుంది. ఈ సినిమా కథ తనది అంటూ, 2011లోనే ఈ కథ రాసుకున్నట్లు.. ప్రముఖ పత్రికలో పని చేస్తున్న గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో నేడు ఈ వ్యాఖ్యలు పై స్పందిస్తూ దర్శకుడు వేణు మీడియా ముందుకు వచ్చాడు. ”నా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఈ కథ ఆలోచన నాకు వచ్చింది. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్, నేను.. ముందు నుంచే మంచి స్నేహితులం. అతనికి నేను మొదట అనుకున్న నాలుగు సీన్ లు మాత్రమే చెప్పాను. అది విన్న అనుదీప్ చాలా బాగుంది, దీనిని తప్పకుండా తెరకెక్కించాలని అన్నాడు.
అంతేకాదు ఆ కథని పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి అనుదీప్ చాలా సహాయం చేశాడు. దాదాపు 10 పల్లెటూరిలో తిరిగి అక్కడి ఉన్న పెద్ద మనుషులను కలిసి ఈ సినిమా కథ కోసం నాతో పాటు అనుదీప్ ఎంతో రీసెర్చ్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.