Kevvu Karthik: పెళ్లి పీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్..! ఆనందంలో సస్పెన్స్ ఏంది సామీ
జబర్దస్ కామెడి షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కార్తీక్ ఒకరు. కార్తీక్ అంటే గుర్తుపట్టే వారి సంఖ్య చాలా తక్కువ అయితే కెవ్వు కార్తీక్(Kevvu Karthik) అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. త్వరలోనే అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Jabardasth Kevvu Karthik
Jabardasth Kevvu Karthik: జబర్దస్ కామెడి షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కార్తీక్ ఒకరు. కార్తీక్ అంటే గుర్తుపట్టే వారి సంఖ్య చాలా తక్కువ అయితే కెవ్వు కార్తీక్(Kevvu Karthik) అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. త్వరలోనే అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఆమె పేరు ఏమిటి..? ఆమె ఎలా ఉంటుందో తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
‘మన జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని కొంత మంది చెబుతుంటారు. బహుశా అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని వీలైనంత తొందరగా మొదలుపెట్టాలని ఎంతగానో ఎదరుచూస్తున్నా.’ అంటూ రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు కార్తీక్. అయితే ఆ రెండు ఫోటోల్లో అమ్మాయి ముఖం మాత్రం కనిపించలేదు. ఇది చూసిన నటీనటులు అదిరే అభి, ప్రియాంక సింగ్, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను, అభినవ్ తదితరులు కార్తీక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Nikhil Siddhartha : నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ.. ‘స్వయంభు’ ఫస్ట్ లుక్ పోస్టర్!
View this post on Instagram
కార్తీక్ తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నాడు. ఉన్నత చదువులు చదివిన కార్తీక్ సినిమాపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాడు. మిమిక్రీగా ఆర్టీస్ట్‌గా పలు స్టేజీ షోలు చేశాడు. ఆ తరువాత ‘కామెడీ క్లబ్’ అనే షోతో కాస్త గుర్తింపు తెచ్చుకుని జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ జనాలను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ముక్కు అవినాష్‌తో కలిసి టీమ్ లీడర్‌గా మారాడు. కొన్ని కారణాల వల్ల అవినాష్ వెళ్లిపోవడంతో సోలోగా ‘కెవ్వు కార్తీక్’ టీమ్ ను లీడ్ చేస్తున్నాడు.
Sobhita Dhulipala : మోడలింగ్ వదిలి నటన వైపు అందుకే వచ్చా.. శోభిత ధూళిపాళ!
ఇక కార్తీక్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు..? ఆమె ఏం చేస్తుంటుంది..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.