అనసూయకు రీప్లేస్‌మెంటేనా?: జబర్దస్త్‌లో మరో యాంకర్

  • Publish Date - February 6, 2020 / 01:52 AM IST

జబర్దస్త్ షోతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమె అనేక సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన ఈ అమ్మడు జబర్దస్త్‌కు మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పుకోవాలి. అయితే ఈ అమ్మడుకు జబర్దస్త్‌లో రీప్లేస్‌మెంట్ లేదని ఇంతకాలం భావించినా ఇప్పుడు మరో యాంకర్‌తో ఆమె ప్లేస్ భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు షో నిర్వహించే మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్.

యాంకర్ అనసూయ తన అందచందాలతో ఆకట్టుకోగా.. అదే స్థాయిలో ఆమెకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు బుల్లితెర మరో స్టార్ యాంకర్ మంజూషను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అనసూయకు రీప్లేస్‌మెంట్ లేదని అందరూ భావించినా మంజూష కరెక్ట్ రీప్లేస్‌మెంట్ అని అందరూ భావిస్తున్నారు. ఆ కొత్త యాంకర్ లేటెస్ట్‌గా హైపర్ ఆది స్కిట్ ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

నాగబాబుతో పాటు అనసూయ మల్లెమాలకు గుడ్ బై చెప్పేస్తుందని ఇటీవల ప్రచారం జరిగినా.. అది జరగలేదు. అయితే ఇప్పుడు మంజూషను లైన్‌లోకి తీసుకుని రావడంతో అనసూయ జబర్ధస్త్‌కు దూరమవుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అనసూయ, రష్మీలకు పోటీగా జబర్దస్త్‌లో ఎవరూ నిలదొక్కుకోలేదు. మధ్యలో ఒకసారి వర్షిణి ఎంట్రీ ఇచ్చినా ఒకట్రెండు ఎపిసోడ్లకే పరిమితం అయ్యింది.

ప్రముఖ చానెల్స్‌లో యాంకరింగ్ చేసిన మంజూష సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లిగా ఈమె కీలక పాత్రలో చేసింది.