Ram Prasad: జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్..? క్లారిటీ ఇచ్చిన కమెడియన్..!

బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో నుండి వచ్చిన చాలా మంది కమెడియన్లు వెండితెరపై తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు పలు సినిమా అవకాశాలు దక్కించుకుని, వెండితెరపై కూడా ఫేం సాధిస్తున్నారు. అయితే వారితో పాటు ఉండి ఆటో పంచ్‌లు వేస్తూ తన పేరునే ‘ఆటో’ రామ్ ప్రసాద్‌గా మార్చుకున్నాడు. అయితే ఈ కమెడియన్ ఇంకా జబర్దస్త్‌లోనే కొనసాగుతున్నాడు.

Ram Prasad: జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్..? క్లారిటీ ఇచ్చిన కమెడియన్..!

Jabardasth Ram Prasad Clarity On Cancer Rumours

Updated On : February 10, 2023 / 7:58 PM IST

Ram Prasad: బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో నుండి వచ్చిన చాలా మంది కమెడియన్లు వెండితెరపై తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు పలు సినిమా అవకాశాలు దక్కించుకుని, వెండితెరపై కూడా ఫేం సాధిస్తున్నారు. అయితే వారితో పాటు ఉండి ఆటో పంచ్‌లు వేస్తూ తన పేరునే ‘ఆటో’ రామ్ ప్రసాద్‌గా మార్చుకున్నాడు. అయితే ఈ కమెడియన్ ఇంకా జబర్దస్త్‌లోనే కొనసాగుతున్నాడు.

Punch Prasad: నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. ఆందోళనలో ఫ్యాన్స్!

కాగా, ఇటీవల ఆయన తలపై ఓ క్యాప్ పెట్టుకుని కనిపించడంతో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్ ఉందని.. ఆయన దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో రామ్ ప్రసాద్‌కు నిజంగానే క్యాన్సర్ ఉందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై రామ్ ప్రసాద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రెండో బ్రాంచ్‌ను తాజాగా మణికొండలో పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కలిసి ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

అక్కడ మీడియా వారితో మాట్లాడిన రామ్ ప్రసాద్, తనకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. తాను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న కారణంగా తలపై క్యాప్ పెట్టుకున్నానంటూ రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు ఇది ఖచ్చితంగా ఊరటనిచ్చే వార్త అని చెప్పాలి. గతేడాది నవంబర్‌ రాంప్రసాద్‌ తలకు సర్జరీ క్యాప్‌ పెట్టుకుని ఆస్పత్రిలో దిగిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా రామ్ ప్రసాద్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తేలడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.