W/O Anirvesh Trailer : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా ‘W/O అనిర్వేశ్’.. ట్రైలర్ రిలీజ్.. భార్య, ప్రియుడు కలిసి భర్తను..

సీనియర్ హీరో శివాజీ W/O అనిర్వేశ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

W/O Anirvesh Trailer : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా ‘W/O అనిర్వేశ్’.. ట్రైలర్ రిలీజ్.. భార్య, ప్రియుడు కలిసి భర్తను..

Jabardasth Ram Prasad W/O Anirvesh Movie Trailer Released by Shivaji

Updated On : March 3, 2025 / 7:51 AM IST

W/O Anirvesh Trailer : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా W/O అనిర్వేశ్. గజేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాణంలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో ఈ W/O అనిర్వేశ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Sankranthiki Vasthunam : ఓటీటీలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ హ‌వా.. హ‌నుమాన్‌, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్‌..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. సీనియర్ హీరో శివాజీ W/O అనిర్వేశ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా W/O అనిర్వేశ్ ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ చూస్తుంటే రామ్ ప్రసాద్ పాత్ర పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్లి తర్వాత కూడా తన ప్రియుడ్ని కలుస్తుండటంతో అది తెలిసి భర్త అనుమానిస్తే అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ W/O అనిర్వేశ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ లాంచ్ అనంతరం శివాజీ.. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అవుతుంది అని అభినందించారు.

Jabardasth Ram Prasad W/O Anirvesh Movie Trailer Released by Shivaji

ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ఈ సినిమా బాగా వచ్చింది. మార్చి 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు. డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ.. జబర్దస్త్ రాంప్రసాద్ లాంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం చాలెంజింగ్ గా అనిపించింది అని అన్నారు.