Jabardasth Tanmay : జబర్దస్త్ లో మేము ముగ్గురమే అమ్మాయిలుగా మారింది.. తన్మయి కామెంట్స్.. ఎవరెవరంటే..?

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో ముగ్గురమే ట్రాన్స్ గా మారింది అని తెలిపింది తన్మయి.

Jabardasth Tanmay Tells Total 3 Members turned as ladies including Sai Lekha and Priyanka Singh

Jabardasth Tanmay : జబర్దస్త్ లో చాలా మంది లేడీ గెటప్స్ వేసేవాళ్ళు ఉన్నారని తెలిసిందే. అందులో మగవాళ్లే యాక్టింగ్ కోసం లేడీ గెటప్స్ వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే చిన్నప్పట్నుంచి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి లక్షణాలు ఉన్నవాళ్లు కూడా జబర్దస్త్ లో మొదట లేడీ గెటప్స్ వేశారు. ఆ తర్వాత కొంతమంది అబ్బాయిల నుంచి అమ్మాయిగా ఆపరేషన్ చేసుకొని మారిపోయారు.

అందులో జబర్దస్త్ తన్మయి కూడా ఒకరు. తన్మయి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో ముగ్గురమే ట్రాన్స్ గా మారింది అని తెలిపింది. తన్మయితో పాటు సాయి లేఖ, ప్రియాంక సింగ్ లు కూడా అబ్బాయిల నుంచి అమ్మాయిలుగా మారారని తెలిపింది. అబ్బాయిలుగా పుట్టినా హార్మోన్స్ ప్రాబ్లస్ వల్ల అమ్మాయిలుగా పెరిగిన వాళ్ళు జబర్దస్త్ తర్వాత ఇలా అమ్మాయిలుగా మారిపోయారు అని క్లారిటీ ఇచ్చింది.

Also Read : Jabardasth Tanmay : వామ్మో.. జబర్దస్త్ తన్మయి ఇన్ని చదువులు చదివిందా? కానీ ఆ సమస్యల వల్ల..

తన్మయికి చిన్నప్పట్నుంచి అమ్మాయిగా ఉండటం అంటేనే ఇష్టం అంట. ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం తెలుసు అని చెప్పింది. ఇలా మారడానికి తనకు మూడు సర్జరీలు జరిగాయని తెలిపింది. తన్మయి ప్రస్తుతం జబర్దస్త్ చేస్తుండగా సాయి లేఖ ఎక్కువగా కనిపించట్లేదు. ప్రియాంక సింగ్ మాత్రం బిగ్ బాస్ లో పాల్గొని ఫేమ్ తెచ్చుకొని ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగానే ఉంది.

Also Read : Jabardasth Tanmay : సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. అందరికి నా మనీ, నా బాడీ కావాలి అంతే.. ఏడ్చేసిన జబర్దస్త్ తన్మయి..