Jabardasth Tanmay : సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. అందరికి నా మనీ, నా బాడీ కావాలి అంతే.. ఏడ్చేసిన జబర్దస్త్ తన్మయి..

చాన్నాళ్ల తర్వాత తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ కష్టాలు చెప్పుకొచ్చింది.

Jabardasth Tanmay : సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. అందరికి నా మనీ, నా బాడీ కావాలి అంతే.. ఏడ్చేసిన జబర్దస్త్ తన్మయి..

Photo Credits : I dream Youtube Channel

Updated On : May 5, 2025 / 7:42 PM IST

Jabardasth Tanmay : జబర్దస్త్ తో పాపులారిటీ తెచ్చుకున్న తన్మయి మధ్యలో కొన్నాళ్ళు ఎవరికీ కనపడకుండా ఇండస్ట్రీకి దూరమయింది. ఇటీవలే మళ్ళీ కొన్నాళ్ల నుంచి జబర్దస్త్, పలు టీవీ షోలు చేస్తూ అలరిస్తుంది. చాన్నాళ్ల తర్వాత తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ కష్టాలు చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో తన్మయి మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ మోసం చేశారు, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఇండస్ట్రీ కూడా మోసం చేశారు. అందరికి నా మనీ, నా బాడీ కావలి అంతే. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు, నా వెనక తిరిగిన వాళ్ళు ఎవరూ ఒక్క రోజు కూడా ఫుడ్ పెట్టరు. నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోడానికి నాకు ఎవరూ లేరు.

Also Read : Tanmay : తిన్నది అరగక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు.. బెట్టింగ్ యాప్స్ పై తన్మయి కామెంట్స్..

నా నడుముకు రీసెంట్ గా సర్జరి జరిగినప్పుడు కూడా నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి రమ్య గారు అని వచ్చి ఒక రోజంతా చూసుకొని సర్జరీ అయ్యాక ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. నన్ను చూసుకోడానికి ఎవరూ లేరు. నేనే ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను. వాళ్ళు హైదరాబాద్ రారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మ ఒక్కదే. నాన్న చనిపోయారు. అమ్మమ్మ, నాన్నమ్మ ముసలివాళ్ళు నేనే సపోర్ట్ చేయాలి. మా అన్న ఊళ్ళో తాపీ పని చేస్తూ బతుకుతాడు. వాళ్ళ పిల్లలకు నేనే మంచి చదువు చెప్పించాలి అంటూ ఏడ్చేసింది తన్మయి.

అలాగే.. మా నాన్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం ఒకరి దగ్గర ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఇండస్ట్రీ వదిలేయ్ మా దగ్గరే ఉండు అన్నారు. ఆ ఆవిషయంలో నేనే తప్పు చేశాను. కానీ ఆ తర్వాత వాళ్ళు కొట్టడం, తిట్టడం, ఫోన్ చేసి హెరాజ్ చేయడం చేశారు. బయటకు తెలిస్తే మా అమ్మవాళ్ళు బాధపడతారు. వాళ్ళ వల్ల నేను చాలా బాధపడ్డాను, ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తా అన్నారు. ఆ భయంతోనే ఓ రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అంటూ ఎమోషనల్ అయింది.

Also Read : Jabardasth Tanmay : మా నాన్న చనిపోయినప్పుడు.. జబర్దస్త్ లో అతనొక్కడే సపోర్ట్ చేసాడు..