Karate Kid : జాకీ చాన్ ‘కరాటే కిడ్: లెజెండ్స్’ ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..?
మీరు కూడా కరాటే కిడ్ - లెజెండ్స్ ట్రైలర్ చూసేయండి..

Jackie Chan Ralph Macchio Karate Kid Legends Telugu Trailer Released
Karate Kid : Karate Kidసూపర్ హిట్ చైనీస్ ఫ్రాంచైజ్ సినిమాల్లో కరాటే కిడ్ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో అయిదు భాగాలూ రాగా ఇప్పుడు ఆరవ భాగం కరాటే కిడ్ – లెజెండ్స్ గా రానుంది. ఇప్పుడు ఈ సినిమాని ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కరాటే కిడ్ లెజెండ్స్ తెలుగులో కూడా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా కరాటే కిడ్ – లెజెండ్స్ ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక కుర్రాడు తన అన్న చనిపోవడంతో కుంగ్ ఫూ వదిలేస్తాడు. తన తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్ళిపోయి అక్కడ ఒక స్కూల్ లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ ఒక లోకల్ కరాటే చాంపియన్ ఇతనితో గొడవలు పెట్టుకుంటాడు. దీంతో న్యూయార్క్ లో జరిగే అతిపెద్ద కరాటే పోటీలో పాల్గోవాలని అనుకుంటాడు. అతనికి తన గురువు, లెజెండరీ కరాటే కిడ్ ల నుంచి సపోర్ట్ లభించడం, అతను కరాటే ఛాంపియన్ ఎలా గెలిచాడు అని సినిమాలో ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Jabardasth Pavithra : 13 ఏళ్ళు నాన్నతో మాట్లాడలేదు.. చనిపోయాక వెళ్లి.. జబర్దస్త్ పవిత్ర ఎమోషనల్..
జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో కలిసి తొలిసారి కనిపించడం గమనార్హం. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది.