Jackie Shroff – OK Computer: న్యూడ్ గెటప్‌లో జాకీ ష్రాఫ్.. వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కోసం కొత్త వేషం

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి సీనియర్ నటుడైన జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో కనిపించి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. హాట్ స్టార్ సమర్పణలో టెలికాస్ట్ కానున్న సైంటిఫిక్ కామెడీ వెబ్ సిరీస్ కోసం కొత్త పాత్రలో కనిపిస్తున్నారట.

Jackie Shroff – OK Computer: న్యూడ్ గెటప్‌లో జాకీ ష్రాఫ్.. వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కోసం కొత్త వేషం

Jockey Shroff

Updated On : March 15, 2021 / 12:39 PM IST

Jackie Shroff – OK Computer: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి సీనియర్ నటుడైన జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో కనిపించి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. హాట్ స్టార్ సమర్పణలో టెలికాస్ట్ కానున్న సైంటిఫిక్ కామెడీ వెబ్ సిరీస్ కోసం కొత్త పాత్రలో కనిపిస్తున్నారట. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ‘OK COMPUTER’ టైటిల్‌తో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక కథాంశాన్ని బట్టి.. టెక్నాల‌జీతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని తెలియ‌జేసే క్ర‌మంలో జాకీ ష్రాఫ్ ఆకులు, పువ్వుల‌ను త‌న శ‌రీరానికి క‌ప్పుకొని మెసేజ్ ఇస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే, విజయ్ వర్మ, రసికా దుగ్గల్, కాని కుస్రుతీలు లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఇది మొత్తం 2031వ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై నడిచే సైంటిఫిక్ కామెడీ మూవీ.

 

దీనిపై జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. ఇందులో నా క్యారెక్టర్ పేరు పుష్పక్. టెక్నాలజీ ఆవశ్యకత తెలుసు. దాంతో పాటు అది పరిసరాలపై ఎలా ప్రభావం చూపిస్తుందో కూడా తెలుసు. టెక్నాలజీతో పాటుగా వాతావరణంపైనా అవగాహన ఉండాలి. ఈ రోల్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఈ క్రెడిట్ అంతా టెక్నిషియన్లది, డైరక్టర్లదే’ అని ష్రాప్ అంటున్నారు.

ఈ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్ లు మార్చి 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానున్నాయి.