వీరారెడ్డిగా జగ్గూభాయ్-మోషన్ పోస్టర్

సైరాలో వీరారెడ్డిగా జగపతి బాబు..

  • Publish Date - February 12, 2019 / 05:23 AM IST

సైరాలో వీరారెడ్డిగా జగపతి బాబు..

మెగాస్టార్ చిరంజీవి, ప్రధాన పాత్రలో, స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, సురేఖ సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా, సైరా నరసింహారెడ్డి.. సైరాలో విలక్షణ నటుడు జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు జగపతి బాబు బర్త్ డే..  ఈ సందర్భంగా, సైరాలో ఆయన లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో జగపతి బాబు.. వీరారెడ్డి పాత్ర చేస్తున్నాడు.

తెల్లటి జుట్టు, గుబురు గెడ్డం, నుదుట బొట్టు, రాజరికం ఉట్టిపడేలా డ్రెస్సింగ్.. వీరారెడ్డి క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు జగ్గూభాయ్.. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తుండగా, లక్ష్మీగా తమన్నా,  సైరా గురువుగా అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న సైరా రిలీజ్ కానుంది. 

వాచ్ మోషన్ పోస్టర్..