Jagapathi Babu : ‘పెద్ది’ వల్ల జగపతి బాబుకి హెల్త్ ఇష్యూస్.. షూటింగ్ తో పాటే ట్రీట్మెంట్..
పెద్ది ప్రమోషన్స్ లో భాగంగా నేడు జగపతి బాబు మీడియాతో మాట్లాడారు. (Jagapathi Babu)
Jagapathi Babu
Jagapathi Babu : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు అప్పలసూరి అనే కీలక పాత్రలో నటించారు.
ఈ పాత్ర కోసం జగపతి బాబు చాలా కష్టపడ్డారు. గంటల పాటు మేకప్ వేసుకొని నటించారు. దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నాను అని తెలిపారు జగపతి బాబు. పెద్ది ప్రమోషన్స్ లో భాగంగా నేడు జగపతి బాబు మీడియాతో మాట్లాడారు.
Also Read : Sameera Reddy : అప్పట్లో ఎన్టీఆర్ తో రొమాన్స్ అదరగొట్టిన భామ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
ఈ క్రమంలో తన మేకప్ గురించి చెప్తూ.. ఈ సినిమాలో నా పాత్రకు ప్రాస్థటిక్ మేకప్ వాడారు. నేషనల్ అవార్డు విన్నర్ మేకప్ మెన్ ని తీసుకొచ్చారు. రోజూ మూడు గంటలు పట్టేది మేకప్ వేయడానికి. తీయడానికి గంటన్నర పట్టేది. రోజంతా షూటింగ్ అయ్యేదాకా ఆ మేకప్ లోనే ఉండేవాడిని. దానివల్ల నాకు ముఖం మీద ర్యాషెస్ వచ్చాయి. ఫేస్ కి ఇబ్బంది అయింది. షూటింగ్ జరిగే రోజుల్లోనే మేకప్ తీసాక ట్రీట్మెంట్ కి వెళ్లిన రోజులు ఉన్నాయి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను ట్రీట్మెంట్ కి. కానీ ఆ మేకప్, ఆ కష్టం ఆ క్యారెక్టర్ చేసినందుకు సంతృప్తినిచ్చింది అని తెలిపారు.

