Jagapathi Babu: బాలీవుడ్‌కి జగ్గూభాయ్.. ఇప్పటినుంచి మరో లెక్క!

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏదైనా సరే యాక్షన్ చెప్పగానే ఎమోషన్స్ తో విధ్వంసం సృష్టించగల పవర్ ఫుల్ యాక్టర్ జగపతిబాబు. అయితే ఇన్నేళ్ల జగపతిబాబు కెరీర్ లో ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.

Jagapathi Babu: బాలీవుడ్‌కి జగ్గూభాయ్.. ఇప్పటినుంచి మరో లెక్క!

Jagapathi Babu

Updated On : April 30, 2022 / 4:45 PM IST

Jagapathi Babu: హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏదైనా సరే యాక్షన్ చెప్పగానే ఎమోషన్స్ తో విధ్వంసం సృష్టించగల పవర్ ఫుల్ యాక్టర్ జగపతిబాబు. అయితే ఇన్నేళ్ల జగపతిబాబు కెరీర్ లో ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క. ఎందుకంటే.. సౌత్ లో విలన్ గా, ఫాదర్ గా క్యారెక్టర్స్ చేస్తున్న జగ్గూ భాయ్.. ఇక సౌత్ వాళ్లకి దొరకాలంటే కష్టమే. ఎందుకంటే.. బాలీవుడ్ లో విలన్ గా బిజీ అవుతున్నారు జగపతిబాబు.

Jagapathi Babu: బాలీవుడ్‌లో జగ్గూభాయ్ ఎంట్రీ.. ఇక గర్జనే!

బాలీవుడ్ మారిపోయింది. టాలీవుడ్ మీద తెగప్రేమ పెంచేసుకుంటోంది. ఈ మధ్య సౌత్ కంటెంట్ ని తెగ ఇష్టపడుతున్న హిందీ జనాలు ఇప్పుడు తెలుగు ఆర్టిస్టుల్నికూడా వదలడం లేదు. వరసగా పుష్ప, ట్రిపుల్ఆర్, లాంటి తెలుగు సినిమాల్ని సూపర్ హిట్ చేసిన బాలీవుడ్.. ఇప్పుడు తెలుగు ఆర్టిస్టుల్ని కూడా వదలకుండా బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకుంటోంది.

Jagapathi Babu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో జగ్గూ భాయ్ లంచ్

తెలుగు సినిమాల సక్సెస్ కి ఫిదా అవుతున్న బాలీవుడ్.. తెలుగు నటుల్ని కూడా తనలో భాగం చేసుకుంటోంది. స్పెషల్లీ తెలుగుని చూసి అడ్మైర్ అవుతున్న బాలీవుడ్ స్టార్లు.. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని తమ సినిమాలో యాడ్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో లీడ్ విలన్ గా జగపతిబాబుని తీసుకున్నట్టు టాక్.

Jagapathi Babu : జగ్గూ భాయ్ సింప్లిసిటీ చూశారా..!

యాక్టర్ అన్న తర్వాత ఏదోక ఇమేజ్ లో ఇరుక్కుపోవాల్సిందే. బట్.. ఈ విషయంలో జగపతిబాబుకు మాత్రం ఎక్సెప్షన్ ఉంది. యాంగ్రీ యంగ్ మెన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న జగపతిబాబు సల్మాన్ ఖాన్ సినిమాలో విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. దబంగ్ 3లోనే జగపతిబాబు విలన్ గా చేస్తున్నాడన్న రూమర్ వచ్చినా అప్పుడు వర్కవుట్ అవ్వలేదు. కానీ జగ్గూభాయ్ కభీ దివాళిలో సల్మాన్ తో ఫైటింగ్ కి రెడీ అవుతున్నాడు.