Jagapathi Babu : ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటున్న జగపతి బాబు.. యాంకర్ గా మారి కొత్త టీవీ షో.. ప్రోమో వైరల్..

తాజాగా జగపతి బాబు యాంకర్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షోని ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేసారు.

Jagapathu Babu as Anchor Jayammu NischayammuRaa With Jagapathi Promo Released

Jagapathi Babu : ఇటీవల సినీ సెలబ్రిటీలు కూడా హోస్ట్ లుగా మారి పలు టీవీ షోలు, ఓటీటీ షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జగపతి బాబు కూడా యాంకర్ గా మారబోతున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సక్సెస్ సినిమాలు చూసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు జగపతి బాబు.

తాజాగా జగపతి బాబు యాంకర్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షోని ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ షో జీ తెలుగు ఛానల్ లో త్వరలో టెలికాస్ట్ అవ్వనుంది.

Also Read : Kaushal Manda : వామ్మో అప్పట్లోనే అంత సంపాదించాడా? పవన్, మహేష్, ఎన్టీఆర్.. అందరూ కౌశల్ దగ్గరికే.. ఆ సినిమా లైఫ్ చేంజ్..

ప్రోమోలో జగపతి బాబు మాట్లాడుతూ.. జ్ఞాపకం.. దాని విలువ ఒక జీవితం. అన్ని నేరుగా చెప్పుకోలేక అమ్మకు రాసిన ఉత్తరం. నాన్న కంటపడకుండా గడిపిన బాల్యం, ఆట కోసమే బతికిన రోజులు, అమ్మ నాన్న కోసమే చదువుకున్న క్షణాలు, అలవాటుగా మారిన అల్లరి పనులు, అన్ని ఉన్నా కూడా చేసిన చిన్ని చిన్ని దొంగతనాలు, కలలా కదిలిపోయిన యవ్వనం, కళ్ళ ముందే మారిపోయిన కాలం, వీటన్నిటివెనక ఒకటే లక్ష్యం.. విజయం. జయమ్ము నిశ్చయమ్మురా అన్న నమ్మకమే సాక్ష్యం.. గుర్తుల్ని జ్ఞాపకాలుగా మార్చుకొని మనసులు గెలుచుకున్న మన మనుషుల కథలు వింటారా.. జయమ్ము నిశ్చయమ్మురా విత్ మీ.. మీ జగపతి అంటూ షో ఎలా ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చారు.

దీంతో సీనియర్ నటీనటులను ఈ షోకి తీసుకువచ్చి అప్పటి సంగతుల గురించి మాట్లాడిస్తారని తెలుస్తుంది. మరి యాంకర్ గా జగపతి బాబు ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక ఈ షోని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. మీరు కూడా జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో చూసేయండి..

Also Read : Akkineni Family : అక్కినేని కోడళ్ళు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్..