Jagaptahi Babu : ప్రేమించడం సరదా.. డైవర్స్ వస్తే పార్టీలు చేసుకుంటున్నారు.. ఈ జనరేషన్ పెళ్లిళ్లపై జగపతి బాబు వ్యాఖ్యలు..

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకోవడం, కొన్ని రోజులకే డైవర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది. సెలబ్రిటీలలో అయితే ఇది మరింత ఎక్కువయింది. తాజాగా దీనిపై జగపతిబాబు కామెంట్స్ చేశారు.

Jagaptahi Babu : ప్రేమించడం సరదా.. డైవర్స్ వస్తే పార్టీలు చేసుకుంటున్నారు.. ఈ జనరేషన్ పెళ్లిళ్లపై జగపతి బాబు వ్యాఖ్యలు..

Jagaptahi Babu sensational comments on this generations love and marriage

Updated On : September 23, 2023 / 12:54 PM IST

Jagaptahi Babu :  ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ గా చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా బోల్డ్ గా మాట్లాడుతూ, ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు జగపతి బాబు. తాజాగా ఇచ్చినా ఓ ఇంటర్వ్యూలో ఈ జనరేషన్ ప్రేమ, పెళ్లిళ్ల గురించి మాట్లాడారు.

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకోవడం, కొన్ని రోజులకే డైవర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది. సెలబ్రిటీలలో అయితే ఇది మరింత ఎక్కువయింది. తాజాగా దీనిపై జగపతిబాబు కామెంట్స్ చేశారు. ఈ జనరేషన్స్ లో ఎక్కువమంది ఒక బంధానికి నిలబడి ఉండట్లేదు, కష్టాలొచ్చినా ఒకరి కోసం ఒకరు నిలబడట్లేదు అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు.

Also Read : Amazon Prime Video : ఇకపై సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్.. యూజర్లకు షాక్ ఇచ్చిన అమెజాన్..

జగపతి బాబు సమాధానమిస్తూ.. ఈ జనరేషన్ లో ప్రేమించడం సరదా అయిపోయింది. పెళ్లియిన కొన్నాళ్లకే డైవర్స్ తీసుకుంటున్నారు. డైవర్స్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు ఒక పని అయిపోయింది అని. ఎవ్వరికి ప్రేమ విలువ తెలియట్లేదు, అస్సలు పెళ్లి విలువ తెలియట్లేదు. ప్రేమ అనేది చచ్చిపోయింది. అందుకే నేను పెళ్లి చేసుకోవద్దు అనే చెప్తున్నాను. నా పెద్దమ్మాయికి పెళ్లి అయిపోయింది. రెండో కూతురికి మాత్రం పెళ్లి చేసుకోవద్దు అనే చెప్పాను, ఇక తన ఇష్టం అని అన్నారు. దీంతో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.