Jai Bheem : జై భీమ్ సినిమాకి మరో రెండు అవార్డులు..

తాజాగా 'జై భీమ్‌' సినిమాని మరో రెండు అవార్డులు వరించాయి. ఈ విషయం అధికారికంగా సూర్య నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌' తెలిపింది. గత నెల ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన............

Jai Bheem : జై భీమ్ సినిమాకి మరో రెండు అవార్డులు..

Jai Bheem

Jai Bheem :  కరోనా లాక్ డౌన్ సమయంలో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఓటీటీలో రిలీజై భారీ విజయం సాధించింది. విమర్శకులు సైతం ఈ సినిమాని, సూర్యతో పాటు నటించిన వారందర్ని ప్రశంసించారు. సూర్య తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చాలా అవార్డులు గెలుచుకుంది. టీజే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జై భీమ్ మూవీ ఇటీవల ‘దాదా సాహేబ్‌ పాల్కే ఫిలీం ఫెస్టివల్‌’లో రెండు అవార్డులను కూడా గెలుచుకుంది. ఇందులో బెస్ట్ ఫిలిం అవార్డుతో పాటు ఈ సినిమాలో నటించిన మణికందన్‌కు ‘బెస్ట్‌ సపోర్టింగ్ యాక్టర్‌’ అవార్డు వచ్చంది.

Disha Patani : ‘ప్రాజెక్టు K’లో మరో బాలీవుడ్ హీరోయిన్.. అధికారికంగా పోస్ట్..

తాజాగా ‘జై భీమ్‌’ సినిమాని మరో రెండు అవార్డులు వరించాయి. ఈ విషయం అధికారికంగా సూర్య నిర్మాణ సంస్థ ‘2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ తెలిపింది. గత నెల ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన ‘బోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో జై భీమ్‌ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటించిన నటి లియోమోల్‌ జోస్‌కు ‘ఇండీ స్పిరిట్ బెస్ట్‌ యాక్ట్రెస్’ అవార్డు వరించగా, ‘ఇండీ స్పిరిట్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ’ అవార్డును మూవీ కెమెరామెన్‌ ఎస్‌.ఆర్‌. కదీర్‌ అందుకున్నారు. ఈ విషయాన్ని తమ నిర్మాణ సంస్థ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.