Disha Patani : ‘ప్రాజెక్టు K’లో మరో బాలీవుడ్ హీరోయిన్.. అధికారికంగా పోస్ట్..

తాజాగా 'ప్రాజెక్టు K' సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది. తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న.............

Disha Patani : ‘ప్రాజెక్టు K’లో మరో బాలీవుడ్ హీరోయిన్.. అధికారికంగా పోస్ట్..

Disha

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు K’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది ‘ప్రాజెక్టు K’. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Chiranjeevi : తల్లితో మెగా బ్రదర్స్.. మదర్స్ డే స్పెషల్ పోస్ట్ చేసిన చిరంజీవి..

తాజాగా ‘ప్రాజెక్టు K’ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది. తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దిశా పటాని ‘ప్రాజెక్టు K’లో నటించనుంది. దిశా పటానీకి వెల్‌కమ్‌ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చంతో పాటు స్పెషల్ గిఫ్ట్ ని పంపించారు చిత్ర యూనిట్. దానిపై దిశా పటానికి ‘ప్రాజెక్టు K’లోకి వెల్కమ్ అని రాసి ఉంది. దిశా ఈ స్పెషల్ గిఫ్ట్ ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. త్వరలోనే దిశా సెట్స్‌కి రానుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.