Money Heist : వెబ్ సిరీస్ చూసేందుకు..సెప్టెంబర్-3న ఉద్యోగులకు సెలవు ఇస్తున్న కంపెనీలు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ “మనీ హీస్ట్” 5వ మరియు ఫైనల్ సీజన్ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రా

Money Heist : వెబ్ సిరీస్ చూసేందుకు..సెప్టెంబర్-3న ఉద్యోగులకు సెలవు ఇస్తున్న కంపెనీలు!

Money

Updated On : August 31, 2021 / 4:00 PM IST

Money Heist ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ “మనీ హీస్ట్” 5వ మరియు ఫైనల్ సీజన్ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 3నుంచి నెట్​ఫ్లిక్స్ లో మనీ హీస్ట్ 5వ సీజన్ ప్రసారం కానుంది. ఈ సిరీస్​కు భారత్​లోనూ మంచి ఆదరణ ఉంది. అయితే భారత్​లోనూ ఈ సిరీస్ కి విపరీతమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో జైపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ‘వెర్వ్​లాజిక్’ అనే ప్రైవేటు సంస్థ.. త‌మ కంపెనీ ఉద్యోగుల‌కు సెప్టెంబ‌ర్ 3న హాలీడే ప్ర‌క‌టించింది. మనీ హీస్ట్ 5వ సీజన్​ విడుదల రోజును ‘నెట్​ఫ్లిక్స్​ అండ్ చిల్’ హాలీడేగా ప్రకటించి ఉద్యోగులను ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఈ మేరకు వర్క్​ఫ్రమ్​ హోమ్ టాస్క్​ లిస్ట్​ను కూడా విడుదల చేసింది.

వెర్వ్​లాజిక్ సీఈవో అభిషేక్ జైన్ ఆగస్టు-26న విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ లో ..మెజారిటీ ఉద్యోగులు ఆరోజు తప్పుడు కారణాలు చెప్పి సెలవు తీసుకుంటారు. కొందరు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్​లో పెట్టేస్తారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బంక్​ కొట్టే అవకాశముంది. అందుకే.. సెలవు ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నాం. కొన్ని సార్లు చిల్​గా ఉండే అవకాశమిస్తే ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు అని తెలిపారు. హాయిగా బెడ్​పై కూర్చుని పాప్​కార్న్​ తింటూ వెబ్​ సిరీస్​ చూడమని జైన్.. తమ సంస్థ ఉద్యోగులకు తెలిపారు. వర్క్​ఫ్రమ్​లోనూ కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు థాంక్యూ చెప్పారు. మరోవైపు,వెర్వ్​లాజిక్ కంపెనీ బాటలోనే మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సెప్టెంబర్-3న సెలవు ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్‌ ఉన్న సిరీస్‌ మనీ హీస్ట్. మనీ హెయిస్ట్‌ ఇప్పటిదాకా రెండు సీజన్స్‌.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్‌ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్‌ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్‌ కానుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్‌ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లోని ప్రొఫెసర్ పాత్రతో అల్వరో మర్టో తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్ర “రాకేల్ మరిల్లో”, టోక్యో, బెర్లిన్, రియో, డెన్వర్, బోగట్టా, మాస్కో వంటి పలు పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఈ నాలుగు ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.

ఈ స్పానిష్ సిరీస్ కథ… ప్రొఫెసర్ అని పిలిచే సూత్రధారి మరియు బ్యాంక్ దొంగతనం కోసం కలిసి పనిచేసే దొంగల బృందం చుట్టూ తిరుగుతుంది. సీజన్ 4లో ప్రొఫెసర్ డైరక్షన్ తో.. దొంగల బృందం సేఫ్ గా బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నుంచి డబ్బులు కొట్టేసి తప్పించుకోగా..సీజన్ -5లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ “రఖెల్ మోరియో”వారిని పట్టుకోగలుగుతుందా లేదా అనేది ఆశక్తికరంగా మారంది. అంతేకాకుండా సీజన్ 4 చివర్లో దొంగల ముఠా నాయకుడు “ఫ్రొఫెసర్” తో పోలీస్ ఆఫీసర్ రాకేల్ మరిల్లో ప్రేమలో పడినట్లు చూపించడంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో అని అందరూ ఆశక్తిగా ఈ సిరీస్ కోసం ఎదరుచూస్తున్నారు. ఇటీవల భారత్ లో ప్రముఖ సినీ స్టార్లతో “మనీ హీస్ట్ ఫ్యాన్ ఆంథమ్” టైటిల్ తో ఓ ప్రోమోను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్ ఇండియా. ఈ ప్రమోషన్ వీడియోలో..నటి శృతి హాసన్ తన నోటిలో ఓ చిన్న పువ్వుతో నైరోబిని( సీజన్ 4 లో మరణించిన పాత్ర)తలుచుకోవడం, మొదటి దోపిడీ సమయంలో డెన్వర్ పాత్రలాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా మనీ బెడ్‌పై డ్యాన్స్ చేయడం..ఫైనల్ సీజన్‌లో అర్టురో చనిపోవాలని కోరుకుంటున్నానని రాధికా ఆప్టే వీడియోలో చెప్పడం…నెటిజన్లలో మరింత ఆశక్తి పెంచింది.

READMoney Heist: దుమ్ము రేపుతున్న”మనీ హీస్ట్” ప్రమోషనల్ సాంగ్.. రాధికా ఆప్టే కోరిక ఏంటో తెలుసా?