No Time to Die : హమ్మయ్యా.. జేమ్స్ బాండ్ వచ్చేస్తున్నాడు..!
డేనియల్ క్రెగ్ హీరోగా ‘నో టైమ్ టు డై’ టైటిల్‌తో బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తోంది..

James Bond
No Time to Die: ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు జేమ్స్ బాండ్‌ని చూద్దామా అని వెయిట్ చేస్తుంటే.. బాండ్ మాత్రం ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ ఊరిస్తూనే.. పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు ‘నేనొస్తున్నానోచ్’ అంటూ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు జేమ్స్ బాండ్.
వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్.. డేనియల్ క్రెగ్ హీరోగా ‘నో టైమ్ టు డై’ టైటిల్‌తో బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తోంది. ఈ సినిమాని మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి దాదాపు 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో డైరెక్టర్ జోజీ ఫకునగా ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారు. వరల్డ్స్ మోస్ట్ అవెయిట్ మూవీ ‘నో టైమ్ టు డై’ సినిమా ఈ అక్టోబర్ 8న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోందని మరో సారి కన్ఫామ్ చేసి బాండ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.
ఎప్పడెప్పుడు ఈ జేమ్స్ బాండ్ మూవీని చూద్దామా అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కోవిడ్ వల్ల ఒకసారి, ఒరిజినల్ డైరెక్టర్ మారడంతో మరోసారి, హీరో డేనియల్‌కి యాక్సిడెంట్ కావడంతో ఇంకోసారి.. ఇలా రకరకాల కారణాలతో పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది జేమ్స్ బాండ్. అయితే ఈ సారి మాత్రం థియేటర్లు కాస్త స్పీడ్ అవ్వడంతో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 8న రిలీజ్ చెయ్యాల్సిందే అని గట్టిగా ఫిక్సయ్యారు మేకర్స్.
2019 నుంచి రిలీజ్ చేద్దామనుకుంటున్న ఈ సినిమా ఇప్పటి వరకూ థియేటర్లలోకొచ్చే మోక్షం కలగలేదు. ఇప్పుడురిలీజ్ కన్ఫామ్ చెయ్యడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్‌తో పాటు డేనియల్ క్రెగ్ లాస్ట్ బాండ్ మూవీ కావడం, మెస్మరైజింగ్ బాండ్ హీరోయిన్స్, మిస్టీరియస్ వెహికల్స్‌తో ఈ సారి ఇంకా ఆడియన్స్‌కి విజువల్ ఫీస్ట్ ప్లాన్ చేశారు మేకర్స్. ‘నో టైమ్ టు డై’ బాండ్ సినిమా ఈసారి ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.