Rajamouli: ఇక్కడ సినిమా చేస్తే చెప్పు బాబాయ్.. జక్కన్నకు జేమ్స్ కామెరాన్ ఆఫర్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు అనేక అవార్డులు, రివార్డులు దక్కుతుండటంతో ఈ సినిమా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Rajamouli: ఇక్కడ సినిమా చేస్తే చెప్పు బాబాయ్.. జక్కన్నకు జేమ్స్ కామెరాన్ ఆఫర్!

James Cameron Interaction With Rajamouli Goes Viral

Updated On : January 21, 2023 / 6:19 PM IST

Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు అనేక అవార్డులు, రివార్డులు దక్కుతుండటంతో ఈ సినిమా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Rajamouli : మోడ్రన్ మాస్టర్స్ అంటూ.. రాజమౌళి పై డాక్యుమెంట్..

కాగా, ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకధీరుడు రాజమౌళితో ముచ్చటించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా రాజమౌళితో కామెరాన్ ఏం మాట్లాడారో దానికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను తాను ఇప్పటివరకు చూడలేదని.. రాజమౌళి విజన్ ఏమిటో ఈ సినిమా చూస్తే అర్థమవుతోందని జేమ్స్ కామెరాన్ జక్కన్నను ప్రశంసించారు.

Rajamouli : మహేష్ బాబు సినిమా 10 ఏళ్ళ పెండింగ్ ప్రాజెక్ట్.. రాజమౌళి!

ఇక ఈ క్రమంలోనే జక్కన్న హాలీవుడ్‌లో ఎప్పుడైనా సినిమా చేసే అవకాశం ఉంటే తనకు ఖచ్చితంగా చెప్పాలని జేమ్స్ కామెరాన్ రాజమౌళిని కోరడం ఈ వీడియోలో కనిపించింది. దీంతో రాజమౌళి సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇక ఈ వీడియోలో జక్కన్నతో పాటు సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి కూడా కనిపించారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సందడిని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డుల బరిలో ఆర్ఆర్ఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.