టైటానిక్‌ని అవెంజర్స్ ముంచేసింది : జేమ్స్ కెమరూన్ ఫన్నీ ట్వీట్
అవెంజర్స్ : ఎండ్‌గేమ్ టైటానిక్, అవతార్‌ల రికార్డులను బీట్ చేసింది, ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది..

అవెంజర్స్ : ఎండ్‌గేమ్ టైటానిక్, అవతార్‌ల రికార్డులను బీట్ చేసింది, ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది..
ఏప్రిల్ 26న రిలీజ్ అయిన అవెంజర్స్ : ఎండ్‌గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో, ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతుందో తెలిసిందే. హాలీవుడ్ సంగతి పక్కన పెడితే ఇండియాలోనూ భారీస్థాయిలో వసూళ్ళు రాబడుతూ ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ సిరీస్ లో ఇదే చివరి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటి వరకు హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా చెప్పుకుంటున్న టైటానిక్, అవతార్‌ల రికార్డులను అవెంజర్స్ బీట్ చేసింది.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అవెంజర్స్ : ఎండ్‌గేమ్ సక్సెస్‌ని పొగుడుతూ.. ‘కెవిన్ (మార్వెల్ సంస్థ అధినేత) అండ్ ఎవ్రీ బడీ ఎట్ మార్వెల్.. రియల్ టైటానిక్‌ని ఒక ఐస్ బర్గ్ ముంచేస్తే, మీ అవెంజర్స్ నా టైటానిక్‌ని ముంచేసింది.. మా లైట్ స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ లోని ప్రతి ఒక్కరూ మీరు సాధించిన అద్భుతమైన ఘనతకు సెల్యూట్ చేస్తున్నాం.. సినిమా పరిశ్రమ సజీవంగానే కాదు, అంతకంటే గొప్పగా ఉందని మీరు ప్రూవ్ చేసారు’.. అంటూ, టైటానిక్‌ని అవెంజర్స్ ముంచేస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఫోటోను కెమరూన్ పోస్ట్ చేసారు.
— James Cameron (@JimCameron) May 9, 2019
ఈ పోస్ట్‌కి నెటిజన్స్ నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఎండ్‌గేమ్ ఇప్పటికే 2.188 బిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్ట్ చెయ్యడమే కాక, అత్యంత వేగంగా 2 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన సినిమాగా అవతార్ క్రియేట్ చేసిన రికార్డ్‌ని సైతం బీట్ చేసేసింది.