Janhvi kapoor : నేను, మా నాన్న ధనవంతులం కాదు.. జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ''నాది సినిమా ఫ్యామిలీ అయినంత మాత్రాన నాకు అవకాశాలు రావు. మహా అయితే మొదటి సినిమా లేదా రెండో సినిమా వరకు నా ఫ్యామిలిని చూసి అవకాశాలు ఇస్తారు. కానీ ఆ తర్వాత నా ఫ్యామిలీని ఎవ్వరూ పట్టించుకోరు. నా నటన, నన్ను మాత్రమే................

Janhvi kapoor intresting comments on her and her father
Janhvi kapoor : శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. వరుసగా కంటెంట్ సినిమాలతో వస్తున్నా కమర్షియల్ సక్సెస్ ఒక్కటి కూడా లేదు. స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళలేదు జాన్వీ. కమర్షియాలు సినిమాలు ఆఫర్ చేసినా నో చెప్తూ వస్తుంది జాన్వీ.
త్వరలో మిలి అనే సినిమాతో జాన్వీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇది కూడా కంటెంట్ బేస్డ్ సినిమానే. మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్ సినిమాని బాలీవుడ్ లో మిలీ పేరుతో రీమేక్ చేశారు. జాన్వీ ప్రస్తుతం మిలీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ”నాది సినిమా ఫ్యామిలీ అయినంత మాత్రాన నాకు అవకాశాలు రావు. మహా అయితే మొదటి సినిమా లేదా రెండో సినిమా వరకు నా ఫ్యామిలిని చూసి అవకాశాలు ఇస్తారు. కానీ ఆ తర్వాత నా ఫ్యామిలీని ఎవ్వరూ పట్టించుకోరు. నా నటన, నన్ను మాత్రమే చూసి అవకాశాలు ఇస్తారు. నేను సరిగ్గా చేయకపోతే నన్ను ఎవరూ వాళ్ళ సినిమాల్లోకి తీసుకోరు. స్టార్ డాటర్ అని నన్ను తీసుకొని నా మీద కోట్లు పెట్టి ఎవరూ నష్టపోవాలని అనుకోరు. నేను, మా నాన్న కూడా అలాంటి నష్టాలూ కావాలనుకోము. ఆ నష్టాలూ భరించేంత ధనవంతులం కూడా కాదు మేము. సినిమాల్లో ఊరికే డబ్బులు పెట్టి పోగొట్టుకునేంత ధనవంతులం కాదు నేను, మా నాన్న. కేవలం నా ట్యాలెంట్ మీద నమ్మకంతోనే సినిమా ఛాన్సులు వస్తున్నాయి” అని తెలిపింది. దీంతో జాన్వీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.