Param Sundari : జాన్వీకపూర్ రొమాంటిక్ సినిమా ట్రైలర్ రిలీజ్.. మలయాళ కుట్టీగా జాన్వీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ అందాల తార జాన్వీకపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పరమ్ సుందరి.

Janhvi Kapoor Param Sundari Trailer out now
బాలీవుడ్ అందాల తార జాన్వీకపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మడాక్ ఫిల్మ్స్‌పై దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా పరమ్ పాత్రలో జాన్వీ సుందరి పాత్రలో నటిస్తున్నారు.
ఆగస్టు 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే పాటలను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ముంబైలో రెస్టారెంట్ పెట్టి.. అక్కడే సెటిల్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు..
ఉత్తరాదికి చెందిన అబ్బాయి, దక్షిణాదిలో కేరళకు చెందిన అమ్మాయి మధ్య చిగురించే ప్రేమకథా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.