Site icon 10TV Telugu

Janhvi Kapoor : మా ఆయన లుంగీ కట్టుకొని.. ముగ్గురు పిల్లలతో.. ఆ ఊళ్ళో సెటిల్ అయి.. జాన్వీ కపూర్ పెళ్లి ప్లానింగ్ విన్నారా?

Janhvi Kapoor says about her Marriage Dream in a Bollywood Show

Janhvi Kapoor says about her Marriage Dream in a Bollywood Show

Janhvi Kapoor : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవరతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నా కమర్షియల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేదు. కానీ స్టార్ కిడ్ అవ్వడంతో, అందాల ఆరబోత బాగా చేస్తుండటంతో వరుస ఆఫర్స్, యాడ్స్, టీవీ షోలతో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ఈ భామ.

అయితే జాన్వీకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మకు తిరుమల, చెన్నై, సౌత్ ప్రేక్షకులు అంటే ఇష్టం ఉండటంతో. జాన్వీ కూడా వీటిపై ఇష్టం పెంచుకుంది. జాన్వీ తన తల్లి శ్రీదేవి చనిపోయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం తిరుమల వచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటుంది. పద్దతిగా హాఫ్ శారీలో తెలుగింటి అమ్మాయిలా రెడీ అయి వస్తుంది. జాన్వీకి కూడా తిరుమల అంటే ఎంతో ఇష్టం.

Also Read : Fake Collections – IT Raids : అవన్నీ ఫేక్ కలెక్షన్సేనా? ఐటీ దాడులతో బెంబేలెత్తుతున్న నిర్మాతలు..

ఇటీవల బాలీవుడ్ లోని ఓ షోలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తన పెళ్లి డ్రీం గురించి చెప్పింది. తన పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలి అని అడిగితే జాన్వీ మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకొని తిరుమల తిరుపతిలో సెటిల్ అవ్వాలి. ముగ్గురు పిల్లలతో ఉండాలి. రోజూ అరటి ఆకుల్లో తినాలి. రోజూ గోవిందా గోవిందా అని వింటూ ఉండాలి. మణిరత్నం సాంగ్స్ వినాలి. మా ఆయన లుంగీలో ఉండాలి. అది చూడటానికి రొమాంటిక్ గా ఉంటుంది అని చెప్పింది. దీంతో జాన్వీ కామెంట్స్ కి ఆ షోలో ఉన్న హోస్ట్ తో పాటు కరణ్ జోహార్ కూడా షాక్ అయ్యాడు.

Also See : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా.. ‘చావా’ ట్రైలర్ చూశారా?

అసలు బాలీవుడ్ కల్చర్ లో పెరిగిన జాన్వీ కపూర్ ఇలా పక్కా తెలుగమ్మాయిలా తన భర్త గురించి చెప్పడం, తిరుపతిలో సెటిల్ అవ్వాలని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే తన తల్లి వల్ల జాన్వీకి తిరుపతి అంటే, సౌత్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. దాంతోనే జాన్వీ ఇలా చెప్పింది అని తెలుస్తుంది. మరి నిజంగానే జాన్వీ కపూర్ తిరుపతిలో సెటిల్ అవుతుందా చూడాలి. ప్రస్తుతం జాన్వీ రామ్ చరణ్ సరసన RC16 సినిమా చేస్తుంది.

Exit mobile version