Fake Collections – IT Raids : అవన్నీ ఫేక్ కలెక్షన్సేనా? ఐటీ దాడులతో బెంబేలెత్తుతున్న నిర్మాతలు..

వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇదంతా చూసిన ఐటీ అధికారులు అవాక్కు అవుతున్నారట.

Fake Collections – IT Raids : అవన్నీ ఫేక్ కలెక్షన్సేనా? ఐటీ దాడులతో బెంబేలెత్తుతున్న నిర్మాతలు..

IT officials shocked to know real collections in IT attacks on film producers

Updated On : January 24, 2025 / 4:27 PM IST

Fake Collections – IT Raids : గత రెండు రోజులుగా నిర్మాత దిల్ రాజు, మైత్రి నిర్మాతల ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది భారీ కలెక్షన్స్, భారీ బడ్జెట్స్ అంటూ ప్రచారం చేయడం వల్లే జరుగుతుందట. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఇంకో రకంగా ఉందని ఐటీ అధికారులు ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం.

తెరముందు కనిపించే దానికి తెర వెనుక కనిపించే దానికి చాలా తేడా ఉంటుంది. అది మూవీ మేకింగ్‌ అయినా లాస్ట్‌కు సినిమా కలెక్షన్స్ అయినా. ఈ మధ్య ఏ హీరో మూవీ రిలీజ్‌ అయినా వందల కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కలెక్షన్స్‌ ఆ రేంజ్‌లో ఉండటం లేదట. ఐటీ రైడ్స్‌లో అసలు కథ బయటపడుతుందట. వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇదంతా చూసిన ఐటీ అధికారులు అవాక్కు అవుతున్నారట.

Also Read : Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంటికి భారీ భద్రత కోసం.. ఎవర్ని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా?

సినిమా అంటే కోట్ల రూపాయట ముచ్చట. స్టార్‌ హీరో, స్టార్‌ డైరెక్టర్, పెద్ద నిర్మాణ సంస్థ పేరు ఎత్తితే చాలు మూవీ బడ్జెట్‌ వందల కోట్లల్లోనే ఉంటుంది బడ్జెట్. సినిమాకు పెడుతున్న ఖర్చు నుంచి కలెక్షన్స్‌ వరకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చెప్పిన ఫిగరే బయట ప్రచారం జరుగుతోంది. ఇక స్టార్‌ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఫస్ట్ డే వంద కోట్లు కలెక్ట్ చేసినట్లు ఊదరగొడుతున్నారు. ప్రతి రోజు ఎంత వసూల్‌ చేస్తుందో చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు నిర్మాతలు. ఇవి చూసిన హీరోలు, వాళ్ల ఫ్యాన్స్ ఖుషి ఖుషి అవుతుంటారు.

హీరోల ఫ్యాన్స్‌ను మెప్పించడానికి రిలీజ్‌ చేస్తున్న ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లతో ఐటీ రైడ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందట. ఇలా ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారట. అసలు లెక్కలు చూపిస్తే ఐటీవాళ్లు అవాక్కు అవుతున్నారట. ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు ఎందుకు రిలీజ్‌ చేయాల్సి వస్తుందో ఐటీ వాళ్లకు చెప్తున్నా అఫీషియల్‌ కలెక్షన్స్ అంటూ ప్రచారం చేయడం చీట్ చేయడమేనన్న టాక్ వినిపిస్తోంది.

Also See : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా.. ‘చావా’ ట్రైలర్ చూశారా?

అయితే ఇక నుంచి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేయకుండా ఉన్నవి ఉన్నట్లు బయటికి చెప్పాలని అనుకుంటున్నారట. ప్రతీసారి సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత ఐటీతో తలనొప్పి అవసరమా అనుకుంటున్నారట. మరి అసలు నిజమైన కలెక్షన్స్‌ చూపించడానికి స్టార్ హీరోలు, వాళ్ళ అభిమానులు ఒప్పుకుంటారా.? స్టార్ రేస్‌లో ఉన్న హీరోలను ఒప్పంచడం నిర్మాతలకు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటివరకు చెప్పిన స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ అబద్ధమేనా? ఫ్యాన్స్ ని మోసం చేసారా అని సందేహాలు వస్తున్నాయి.